టెస్టింగ్ లో 16 Gbps స్పీడ్ నమోదు చేసిన 5G నెట్ వర్క్.. ఇదేం స్పీడ్ రా బాబు.!

టెస్టింగ్ లో 16 Gbps స్పీడ్ నమోదు చేసిన 5G నెట్ వర్క్.. ఇదేం స్పీడ్ రా బాబు.!
HIGHLIGHTS

కొత్త టెస్ట్ లో 16 Gbps స్పీడ్ తో డౌన్ లోడ్ స్పీడ్ ను సాధించి కొత్త రికార్డ్

యావత్ ప్రపంచం 5G నెట్ వర్క్ లో దూసుకు పోతోంది

రానున్న రోజుల్లో మరింత స్పీడ్ నమోదు చేస్తుందనే అంచనాలను కూడా రేకెత్తిస్తోంది

యావత్ ప్రపంచం 5G నెట్ వర్క్ లో దూసుకు పోతోంది. అంతేకాదు ఈ లిస్ట్ లో భారత్ ఎప్పుడో చేరిపోయింది. అయితే, 5జి నెట్ వర్క్ స్పీడ్ ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకు పోవడానికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త ప్రయోగాలు మరియు టెస్టింగ్ లు జరుగుతున్నాయి. 5జి నెట్ వర్క్ పైన జరిపిన కొత్త టెస్ట్ లో 16 Gbps స్పీడ్ తో డౌన్ లోడ్ స్పీడ్ ను సాధించి కొత్త రికార్డ్ ను నెలకొల్పింది Du (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) (UAE). ఈ దెబ్బకి 5G మీద అంచనాలు మరింతగా పెరిగడమే కాదు రానున్న రోజుల్లో మరింత స్పీడ్ నమోదు చేస్తుందనే అంచనాలను కూడా రేకెత్తిస్తోంది.

Du, ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (EITC) Ericsson సంయుక్తంగా నిర్వహించిన లైవ్ 5G స్టాండ్ అలోన్ (SA) టెస్టింగ్ లో మొత్తంగా 16.7 Gbps వేగాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. 5G నెట్ వర్క్ పైన ఈ వేగాన్ని సాధించడం గొప్ప అచీవ్ మెంట్ అవుతుంది. అంతేకాదు, ప్రసుతం 1 Gbps వద్ద మాత్రమే కొనసాగుతున్న చాలా దేశాల నెట్ వర్క్ లకు దిశా నిర్ధేశాలను సూచించేలా ఉంటుంది.

Also Read: Big Price Cut: సగం ధరకే లభిస్తున్న లేటెస్ట్ Poco స్మార్ట్ ఫోన్.!

8 mm Wave క్యారియర్స్ మరియు 2 మిడ్ బ్యాండ్ క్యారియర్స్ కలయికతో ఎరిక్సన్ 5G SA కొత్త రేడియో కనెక్టివిటీ (NR-DC ) పైన ఈ ట్రయల్ ను రాం చేసినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో కనెక్టివిటీ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకు వెళ్లే దిశగా ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (EITC) అడుగులు వేస్తున్నట్లు చెబుతోంది. అంతేకాదు, ప్రసుతం నమోదు చేసిన అత్యున్నత వేగాన్ని దాటి మరిన్ని వేగాలను చేసుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo