ఏపీకి BSNL కొత్త ఆఫర్: OTT, ఇంటర్నెట్ మరియు ఫోన్ సేవలతో కొత్త ట్రిపుల్ ప్లే ప్లాన్ లాంచ్.!

HIGHLIGHTS

ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో కొత్త ట్రిపుల్ ప్లే ప్లాన్ లాంచ్ చేసింది

ఇంటికి అవసరమైన ఇంటర్నెట్, టీవీ మరియు కాలింగ్ వంటి అన్ని అవసరాలు తీరుస్తుంది

ఈ ప్లాన్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్ గా ఉంటుంది

ఏపీకి BSNL కొత్త ఆఫర్: OTT, ఇంటర్నెట్ మరియు ఫోన్ సేవలతో కొత్త ట్రిపుల్ ప్లే ప్లాన్ లాంచ్.!

ఏపీకి BSNL కొత్త ఆఫర్: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో కొత్త ట్రిపుల్ ప్లే ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చాలా తక్కువ ఖర్చుతో ఇంటిని అవసరమైన ఇంటర్నెట్, టీవీ మరియు కాలింగ్ వంటి అన్ని అవసరాలు తీరుస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్, టీవీ మరియు కాలింగ్ కోసం విడిగా లేదా ఎక్కువ మొత్తంలో చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ఈ ప్లాన్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్ గా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా BSNL ట్రిపుల్ ప్లే ప్లాన్?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఆంధ్రప్రదేశ్ సర్కిల్ “ట్రిపుల్ ప్లే ప్లాన్” (TPP) పేరుతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అందించింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను కేవలం రూ. 400 రూపాయలు రీఛార్జ్ తో అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు నెల మొత్తం హై స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానల్స్ మరియు ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీస్ కూడా అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను రివీల్ చేశారు.

ఈ కొత్త హై స్పీడ్ సేవలను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇదే కాదు, ఇటివల 1 రూపాయికే బిఎస్ఎన్ఎల్ అందించిన ఉచిత సిమ్ మరియు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ గురించి కూడా మరోసారి గుర్తు చేశారు. ఈ కొత్త ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ అఫీషియల్ వెబ్సైట్, 1800 444 వాట్సాప్ సర్వీస్ నెంబర్ మరియు బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు, అని ఈ సందర్భంగా వివరించారు.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు నెల మొత్తం హై స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానల్, OTT యాక్సెస్ మరియు ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీస్ ఆఫర్ చేస్తుంది.

Also Read: OnePlus 13R స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

BSNL ట్రిపుల్ ప్లే ప్లాన్ హైలైట్స్

  • కేవలం రూ. 400 తో రీఛార్జ్ అవుతుంది
  • ఇంటర్నెట్ + టీవీ + ల్యాండ్ ఫోన్ మూడు సర్వీసులు అందిస్తుంది
  • 400 లైవ్ టీవీ ఛానల్స్ ఆఫర్ చేస్తుంది
  • 9 ప్రముఖ OTT యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది

ఇక బిఎస్ఎన్ఎల్ కొత్తగా అందించిన కొత్త రూ. 1 రూపాయి ఫ్రీడమ్ ప్లాన్ విషయానికి వస్తే, కొత్త సిమ్ కార్డు తీసుకునే యూజర్ల కోసం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ తో 30 రోజులు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS వంటి ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే మరియు ఇది ఈ నెల చివరి తో ముగుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo