BSNL: దేశవాప్తంగా 4G సేవల విస్తరణ మరియు డోర్ స్టెప్ SIM తో పాటు Q-5G కోసం కొత్త చర్యలు.!

HIGHLIGHTS

: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు షాకిచ్చింది

దేశవాప్తంగా 4G సేవల విస్తరణ కోసం కొత్త టవర్లు నిర్మిస్తూ దూసుకుపోతున్న ప్రభుత్వ టెలికాం

క్వాంటం 5జి తీసుకురావడానికి కూడా బిఎస్ఎన్ఎల్ ఏకకాలంలో పని చేస్తోంది

BSNL: దేశవాప్తంగా 4G సేవల విస్తరణ మరియు డోర్ స్టెప్ SIM తో పాటు Q-5G కోసం కొత్త చర్యలు.!

BSNL : ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు షాకిచ్చింది. దేశవాప్తంగా 4G సేవల విస్తరణ కోసం కొత్త టవర్లు నిర్మిస్తూ దూసుకుపోతున్న ప్రభుత్వ టెలికాం, ఇప్పుడు ఈ సేవలు దేశవాప్తంగా శరవేగంగా అందుబాటులోకి రావడానికి సిద్ధమయింది. ఇప్పటికే చాలా ఏరియాలో 4జి నెట్ వర్క్ కోసం టవర్ల నిర్మాణం జరగగా, మరింత వేగంగా పనులు పూర్తి చేయడానికి కొత్తగా మరో 6,982 కోట్ల రూపాయల నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కొత్త చర్యతో అనుకున్న దానికంటే ముందుగానే దేశవ్యాప్త 4G నెట్ వర్క్ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL: 4G విస్తరణ

ప్రైవేట్ టెలికాం కంపెనీలు చాలా కాలంగా 5G సర్వీసులను అందిస్తుండగా, ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో 4జి నెట్ వర్క్ విస్తరణకు నోచుకోలేదు. అయితే, ఇక నుంచి ఆ మాట వినపడకుండా చేసేలా ఈ కొత్త చర్య ఉపయోగపడుతుందని యోచిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 96 వేల కంటే ఎక్కువ ఏరియాల్లో కొత్త టవర్స్ నిర్మించడమే కాకుండా 4జి సేవలు అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది.

BSNL Quantum 5G

అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించిన కొత్త ప్రోత్సాహంతో బిఎస్ఎన్ఎల్ శరవేగంగా 4జి నెట్ వర్క్ ను దేశవాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్థిరమైన కనెక్టివిటీ అందించడానికి బిఎస్ఎన్ఎల్ ఈసారి గట్టిగా పని చేస్తోంది. ఇది మాత్రమే కాదు ఇంటి వద్దకే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ను అందించే డోర్ స్టెప్ SIM డెలివరీ సర్వీస్ కూడా బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తుంది.

Also Read: Jio – Airtel Down: మీ ఫోన్ లో సిగ్నల్ లేదా.. అయితే ఇదే కారణం.!

BSNL Quantum 5G

కేవలం 4జి నెట్ వర్క్ కోసం మాత్రమే ఈ కొత్త చర్య తీసుకోలేదు. బిఎస్ఎన్ఎల్ క్వాంటం 5జి కోసం కూడా ఇది సహాయం చేస్తుంది. 4జి తో పాటు క్వాంటం 5జి తీసుకురావడానికి కూడా బిఎస్ఎన్ఎల్ ఏకకాలంలో పని చేస్తోంది. ఈ కొత్త టెక్నాలజి పనులు పూర్తయితే యూజర్లకు అధిక వేగం కలిగిన వేగవంతమైన ఇంటర్నెట్, IoT పరికరాలకు మద్దతు మరియు స్మార్ట్ సిటీ సొల్యూషన్ కూడా వీలవుతుంది.

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, రానున్న కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి బిఎస్ఎన్ఎల్ 4జి నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకు రావడం మాత్రమే కాకుండా దశల వారీగా బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5జి సర్వీస్ ను కూడా అందించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఏక చక్రాధిపత్యం గా కొనసాగుతున్న ప్రైవేట్ టెలికాం కంపెనీలకు భారీ పోటీగా బిఎస్ఎన్ఎల్ నిలిచే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo