Jio – Airtel Down: మీ ఫోన్ లో సిగ్నల్ లేదా.. అయితే ఇదే కారణం.!
జియో మరియు ఎయిర్టెల్ నెట్ వర్క్ డౌన్ అయినట్లు యూజర్లు పెద్ద మొత్తంలో కంప్లైంట్ చేస్తున్నారు
downdetector ద్వారా ఈ రెండు టెలికాం నెట్ వర్క్ గురించి యూజర్లు పెద్ద మొత్తంలో రిపోర్ట్స్ అందించారు
జియో నెట్ వర్క్ డౌన్ అయినట్లు 7 వేలకు పైగా రిపోర్ట్ అందుకుంది
Jio – Airtel Down: దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జియో మరియు ఎయిర్టెల్ నెట్ వర్క్ డౌన్ అయినట్లు యూజర్లు పెద్ద మొత్తంలో కంప్లైంట్ చేస్తున్నారు. ప్రముఖ అవుటేజ్ ప్లాట్ ఫామ్ downdetector ద్వారా ఈ రెండు టెలికాం నెట్ వర్క్ గురించి యూజర్లు పెద్ద మొత్తంలో రిపోర్ట్స్ అందించారు. ఈ నెలలో ఎయిర్టెల్ నెట్వర్క్ డౌన్ గురించి రిపోర్ట్ అందుకోవడం ఇది రెండోసారి అవుతుంది. అయితే, ఈ మధ్యాహ్నం నుంచి జియో నెట్ వర్క్ డౌన్ అయినట్లు 7 వేలకు పైగా రిపోర్ట్ అందుకుంది.
SurveyJio – Airtel Down:
ఉదయం ఎయిర్టెల్ నెట్ వర్క్ డౌన్ అయినట్లు డౌన్ డిక్టేటర్ నుంచి రిపోర్ట్ అందుకుంది. అయితే, ప్రస్తుతం ఈ నెట్ వర్క్ దారిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఎయిర్టెల్ నెట్ వర్క్ గురించి వస్తున్నా రిపోర్ట్ సంఖ్య కూడా తగ్గిపోయింది. కానీ, మధ్యాహ్నం ఎక్కువగా రిపోర్ట్ అందుకుంది.

ఇక జియో నెట్వర్క్ విషయానికి వస్తే, మధ్యాహ్నం 2 గంటల నుంచి జియో నెట్ వర్క్ పని చేయడం లేదంటూ పెద్ద సంఖ్యలో రిపోర్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1;47 నిముషాలకు ప్రారంభమైన ఈ నెట్ వర్క్ ఇష్యూ రిపోర్ట్స్, 2:30 తర్వాత తారాస్థాయికి చేరుకుంది. ఈ మద్యం సమయంలో దాదాపు 13 వేలకు పైగా రిపోర్ట్ ఈ ప్లాట్ ఫామ్ లో నమోదయ్యాయి.
Also Read: Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ Sony 3X పెరిస్కోప్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Jio – Airtel Down: ఎక్కడ అయ్యింది?
డౌన్ డిక్టేటర్ అందుకున్న రిపోర్ట్స్ ప్రకారం జియో ఈ నెట్ వర్క్ డౌన్ అయినట్లు దేశం నలుమూలల నుంచి కూడా రిపోర్ట్ అందుకుంది. ఇందులో, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా వంటి ప్రధాన నగరాలతో పాటు మరికొన్ని సిటీలు ఉన్నాయి.

డౌన్ డిక్టేటర్ రిపోర్ట్ ప్రకారం, జియో నెట్ పై వచ్చిన కంప్లైంట్ లో 68% నెట్ వర్క్ ఇష్యు గురించి వచ్చినవి కాగా 17% టోటల్ బ్లాక్ అవుట్ మరియు 16% మొబైల్ ఇంటర్నెట్ గురించి ఉన్నాయి.
ప్రస్తుతం మీ ఫోన్ లో సిగ్నల్ లేకుంటే దానికి కారణం జియో మరియు ఎయిర్టెల్ సిగ్నల్ డౌన్ అయినట్లు మీరు గమనించాలి. అయితే, ఈ సమస్య అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు. కాబట్టి, మీ ఫోన్ ను ఒకసారి ఫ్లైట్ మోడ్ లోకి ఆన్ ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవడం కూడా మంచిది. అప్పుడు కూడా మీ ఫోన్ లో నెట్ వర్క్ రాకపోయినట్లయితే మీ ఏరియాలో కూడా జియో లేదా ఎయిర్టెల్ నెట్ వర్క్ డౌన్ అయినట్లు నిర్ధారించుకోవచ్చు.