HIGHLIGHTS
2GB ఉచిత డేటా అందుకునే గొప్ప అవకాశం కస్టమర్లకు ఎయిర్టెల్ అందించింది
మరిన్ని ప్రయాజనాలను ఈ ప్లాన్స్ పైన మీరు పొందవచ్చు
ఎయిర్టెల్ అఫర్ ఎలా పొందాలో మనం వివరంగా తెలుసుకోవచ్చు
2GB ఉచిత డేటా అందుకునే గొప్ప అవకాశం కస్టమర్లకు ఎయిర్టెల్ అందించింది. అయితే, ఈ అవకాశం కేవలం కొన్ని ప్లాన్స్ రీఛార్జ్ పైన మాత్రమే ఎయిర్టెల్ అందించింది. ఈ 2GB ఉచిత డేటాను పొందాలంటే, ఎయిర్టెల్ కస్టమర్లు రీఛార్జ్ ని ఎయిర్టెల్ యాప్ నుండి చేయాల్సి వుంటుంది. Airtel Thanks APP నుండి రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ 2GB ఉచిత డేటా అందుకునే అవకాశం వుంటుంది. ఈ ఎయిర్టెల్ అఫర్ ఎలా పొందాలో మనం వివరంగా చూద్దామా.
SurveyAirtel తన కస్టమర్లకు 2GB ఉచిత డేటా ప్రయోజనాన్ని అందించింది. ఎయిర్టెల్ కస్టమర్లు థాంక్స్ యాప్ నుండి రూ.265, రూ.359, రూ.699, రూ.719 మరియు రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసే వారికి ఈ ఉచిత డేటా అఫర్ వర్తస్తుంది. అయితే, ఈ రీఛార్జ్ ను Airtel Thanks APP నుండి చేస్తే మాత్రమే ఈ అఫర్ వర్తిస్తుంది.
ఇక్కడ సూచించిన అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ను అందించే ప్లాన్స్. అంతేకాదు, ఇప్పుడు ప్రకటించిన ఉచిత డేటాతో కలుపుకొని డబుల్ బెనిఫిట్స్ ఈ ప్లాన్స్ అందిస్తాయి. కేవలం ఇది మాత్రమే కాదు మరిన్ని ప్రయాజనాలను ఈ ప్లాన్స్ పైన మీరు పొందవచ్చు. అయితే, ఈ లాభాలను మీరు Airtel Thanks APP నుండి రీఛార్జ్ చేస్తే మాత్రమే పొందగలుగుతారని గుర్తుంచుకోండి.