Jio vs Airtel vs Vi: లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ (30,31) రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్..!!

Jio vs Airtel vs Vi: లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ (30,31) రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్..!!
HIGHLIGHTS

Jio లేటెస్ట్ క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్

Airtel లేటెస్ట్ క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్

Vi లేటెస్ట్ క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్

TRAI నిర్ధేశాల మేరకు జియోతో పాటుగా ఎయిర్టెల్ మరియు Vi (వోడాఫోన్ ఐడియా) టెలికం సంస్థలు కూడా క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించాయి.  క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అంటే పూర్తి నెల రోజుల(30,31రోజుల) వ్యాలిడిటీని కలిగివుండే ప్లాన్స్. ఈ విభాగంలో జియో, ఎయిర్టెల్ మరియు Vi ( వోడాఫోన్ ఐడియా) మూడు టెలికం సంస్థలు కూడా తమ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించాయి. జియో, ఎయిర్టెల్ మరియు Vi ( వోడాఫోన్ ఐడియా) తీసుకొచ్చిన ఆ కొత్త వన్ మంత్ ప్లాన్స్ మరియు వాటి వివరాలను ఈరోజు చూద్దాం.

జియో కొత్తగా తీసుకొచ్చిన రూ.259  ప్రీపెయిడ్ ప్లాన్ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ, అంటే నెలలో ఎన్ని రోజులు ఉన్నాసరే (28,30, లేదా 31) అన్ని రోజులకు వర్తిస్తుంది. అంటే క్లియర్ గా చెప్పాలంటే, ఈ నెల ఎన్నో తారిఖున రీఛార్జ్ చేస్తారో వచ్చే నెల ఆ తారీఖు వరకు ప్లాన్ చెల్లుబాటు అవుతుంది.

జియో రూ.259  ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.259  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

ఎయిర్టెల్  రూ.296 మరియు రూ.319 రూపాయల ధరతో ఈ వన్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. వీటిలో మొదటి ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తే, రెండవ ప్లాన్ మాత్రం నెలలో వుండే రోజులతో సంభంధం లేకుండా పూర్తి నెలరోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే, ఈ నెల ఏ తేదికి మీరు రీఛార్జ్ చేస్తారో వచ్చే నెల ఆ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది.  

ఎయిర్టెల్ రూ.296 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ 30 వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 25GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్  లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ ను కూడా పొందవచ్చు. వీటితో పాటుగా ఉచిత హలో ట్యూన్స్, Wynk Music, FASTag పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి అదనపు లాభాలను కూడా ఈ ప్లాన్ రీఛార్జ్ తో కస్టమర్లు పొందుతారు.                                           

ఎయిర్టెల్ రూ.319 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి నెల రోజుల (30 లేదా 31 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 2GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్  లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ ను కూడా పొందవచ్చు. వీటితో పాటుగా ఉచిత హలో ట్యూన్స్, Wynk Music, FASTag పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి అదనపు లాభాలను కూడా ఈ ప్లాన్ రీఛార్జ్ తో కస్టమర్లు పొందుతారు. 

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.327 మరియు రూ.337 రూపాయల ధరతో ఈ వన్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. వీటిలో రూ.327 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తే, రూ.337 ప్లాన్ మాత్రం నెలలో వుండే రోజులతో సంభంధం లేకుండా పూర్తి నెలరోజుల చెల్లుబాటుతో వస్తుంది. అర్ధమయ్యేలా చెప్పాలంటే, ఈ నెల ఏ తేదికి మీరు రీఛార్జ్ చేస్తారో వచ్చే నెల ఆ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ రెండు ప్లాన్స్ కూడా లిమిటెడ్ డేటాని మాత్రమే అందిస్తాయి.

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.327 ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.327 ప్రీపెయిడ్ ప్లాన్ 30 వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 25GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్  లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, Vi మూవీస్ మరియు TV యొక్క ఉచిత సభ్యత్వాలను పొందుతారు.                           

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.337 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.337 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి నెల రోజుల (30 లేదా 31 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 28GB  హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్  లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అధనంగా, Vi మూవీస్ మరియు TV యొక్క ఉచిత సభ్యత్వాలను పొందుతారు.

మరిన్ని బెస్ట్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo