BSNL IFTV : నెలకు కేవలం రూ. 61 ఖర్చుతోనే 1000 కంటే ఎక్కువ ఛానల్స్ అందుకోండి.!
బిఎస్ఎన్ఎల్ కొత్తగా అందించిన ఐఎఫ్‌టీవీ ఆఫర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది
అదనపు పరికరం లేకుండా కేవలం ఇంటర్నెట్ సహాయంతో టీవీ ఛానల్స్ చూసే అవకాశం ఉంటుంది
ఈ కొత్త సర్వీస్ ను పొందడానికి సులువైన Whatsapp చాట్ బాట్ సర్వీస్ అందుబాటులో ఉంది
BSNL IFTV : బిఎస్ఎన్ఎల్ కొత్తగా అందించిన ఇంటర్నెట్ ఫైబర్ టీవీ (ఐఎఫ్‌టీవీ) ఆఫర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త సర్వీస్ తో ఎటువంటి అదనపు పరికరం లేకుండా కేవలం ఇంటర్నెట్ సహాయంతో టీవీ ఛానల్స్ చూసే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సర్వీస్ ను కేవలం రూ. 61 రూపాయల అతి తక్కువ ధరకే బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ కొత్త సర్వీస్ ను పొందడానికి సులువైన WhatsApp చాట్ బాట్ సర్వీస్ అందుబాటులో ఉంది.
SurveyBSNL IFTV : ఏమిటి ఈ సర్వీస్?
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ తన Bharat Fiber (FTTH) కస్టమర్ల కోసం కేవలం నామమాత్రపు ధరకు ఇంటర్నెట్ పై టీవీ చానల్స్ అందించడానికి తెచ్చిన సర్వీస్ ఇది. ఈ సర్వీస్ పొందడానికి నెలకు కేవలం రూ. 61 రూపాయలు ఖర్చు మాత్రమే అవుతుంది. ఇది కేవలం రూ. 61 రూపాయలకే 1000 కంటే ఎక్కువ SD మరియు HD ఛానల్స్ అందిస్తుంది.
BSNL IFTV సర్వీస్ వాట్సాప్ ద్వారా ఎలా యాక్టివేట్ చేయాలి?
ఈ కొత్త సర్వీస్ ను బిఎస్ఎన్ఎల్ యూజర్లు చాలా సులభంగా WhatsApp చాట్ బాట్ సర్వీస్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ముందుగా, వాట్సాప్ లో 1800 4444 నెంబర్ చాట్ బాట్ సర్వీస్ ఓపెన్ చేయాలి. ఇక్కడ చాట్ బాక్స్ లో జస్ట్ ‘HI’ అని మెసేజ్ చేయండి. వెంటనే “Welcome to BSNL Customer Helpline” సర్వీస్ ప్రధాన మెనూ వస్తుంది. ఇందులో FTTH/Landline ఆప్షన్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇందులో కనిపించే ‘Activate IFTV’ ఆప్షన్ పై నొక్కండి. వెంటనే మీ అకౌంట్ యాక్టివేట్ చేయబడుతుంది.

అయితే, మీరు మీ రిజిస్టర్ బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్ తో మాత్రమే ఈ సర్వీస్ ను యాక్టివేట్ చేయగలుగుతారు. అంతేకాదు, మీరు యాక్టివ్ BSNL Bharat Fiber (FTTH) కనెక్షన్ కలిగి ఉండాలి. అయితే, ఈ సర్వీస్ పొందడానికి మీకు ఎటువంటి సెటాప్ బాక్స్ అవసరం ఉండదు. బిఎస్ఎన్ఎల్ కొత్త ఇంటర్నెట్ ఫైబర్ టీవీ (ఐఎఫ్‌టీవీ) ని మీ స్మార్ట్ టీవీ లేదా ఫైర్ టీవీ స్టిక్ లేదా గూగుల్ క్రోమ్ క్యాస్ట్ వంటి పరికరాల ద్వారా టీవీలో చూసే అవకాశం ఉంటుంది.
Also Read: BBD Sale కంటే మూడు రోజుల ముందే LG Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ డీల్ అందుకోండి!
ఇందులో ప్రస్తుతం టీవీ ఛానల్స్ మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలో OTT ఇంటిగ్రేషన్ కూడా అందుబాటులోకి రానుందని BSNL హింట్ ఇచ్చింది. ఈ అప్డేట్ ఎప్పుడు అందిస్తుందో చూడాలి.