ఈ కొత్త Jio Plan మీకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అండ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.!
Jio Plan అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అండ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది
2026 Happy New Year సందర్భంగా రిలయన్స్ జియో సరికొత్తగా అందించిన ప్లాన్
అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్ అవుతుంది
2026 Happy New Year సందర్భంగా రిలయన్స్ జియో సరికొత్తగా అందించిన ఒక Jio Plan అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అండ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే తీసుకొచ్చింది మరియు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. అన్లిమిటెడ్ కాలింగ్ డేటా తో పాటు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్ అవుతుంది.
SurveyJio Plan : ఏమిటి బెస్ట్ ప్లాన్?
కొత్త సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. వాస్తవానికి, ఈ ప్లాన్ తో పాటు మరో డేటా ప్లాన్ ను కూడా జియో అందించింది. అయితే, ఇది అన్లిమిటెడ్ లాభాలు మరియు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించే ప్లాన్ గా ఇది ఒక్కటి మాత్రమే నిలుస్తుంది. అదే, జియో కొత్తగా అందించిన రూ. 500 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ కొత్త ప్లాన్ కంప్లీట్ బెనిఫిట్స్ ను 28 రోజు ఆఫర్ చేస్తుంది.
జియో రూ. 500 ప్లాన్ ప్రయోజనాలు
జియో రూ. 500 ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 28 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100SMS వంటి ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 4జి నెట్ వర్క్ పైన డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. 50 జీబీ ఉచిత Jio AI Cloud స్టోరేజ్ కూడా అందిస్తుంది.

కేవలం పైన తెలిపిన బెనిఫిట్స్ మాత్రమే కాదు ఈ ప్లాన్ గొప్ప ఎంటర్టైన్మెంట్ లాభాలు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్, జియో హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కంచె లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయ్ చోయ్, ఫ్యాన్ కోడ్ మరియు జియో టీవీ OTT ఛానల్స్ కి యాక్సెస్ అందిస్తుంది. అంటే, ఈ ఓటిటీ నుంచి మీరు 28 రోజలు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: లేటెస్ట్ Samsung Galaxy Buds పై అమెజాన్ భారీ కూపన్ డిస్కౌంట్ ప్రకటించింది.!
అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా తో పాటు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే యూజర్ల కోసం ఈ ప్లాన్ ను కొత్త సంవత్సర కానుకగా అందించినట్లు జియో తెలిపింది. ఈ ప్లాన్ తీసుకునే ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ మరియు యూట్యూబ్ వంటి వాటి కోసం విడిగా సబ్ స్క్రిప్షన్ తీసుకునే అవసరం ఉండదు.