Vivo X200 FE 5G: ప్రీమియం ఫీచర్స్ వచ్చిన వివో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

ప్రత్యేకమైన కార్యక్రమం నుంచి రెండు వివో X Fold 5 మరియు వివో ఎక్స్ 200 FE రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేసింది

Vivo X200 FE 5G స్మార్ట్ ఫోన్ ను X200 సిరీస్ బడ్జెట్ ఫోన్ గా అందించింది

ఈ ఫోన్ లాంచ్ మాత్రమే కాదు ఈరోజు నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ కూడా వివో స్టార్ట్ చేసింది

Vivo X200 FE 5G: ప్రీమియం ఫీచర్స్ వచ్చిన వివో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Vivo X200 FE 5G: వివో ఈరోజు నిర్వహించిన ప్రత్యేకమైన కార్యక్రమం నుంచి రెండు వివో X Fold 5 మరియు వివో ఎక్స్ 200 FE రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. వివో 200 సిరీస్ యొక్క బడ్జెట్ ఫోన్ గా తీసుకు వచ్చిన ఎక్స్ 200 FE స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ లాంచ్ మాత్రమే కాదు ఈరోజు నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ కూడా వివో స్టార్ట్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo X200 FE 5G: ఫీచర్స్

వివో ఈ ఫోన్ ను మీడియాటెక్ యొక్క లేటెస్ట్ మరియు సూపర్ ఫాస్ట్ 5జి చిప్ సెట్ Dimensity 9300+ తో లాంచ్ చేసింది. ఈ వేగవంతమైన చిప్ సెట్ కి జతగా 16 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512 జీబీ (UFS 3.1) హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను పటిష్టమైన అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ మరియు పటిష్టమైన గ్లాస్ తో అందించింది. ఈ ఫోన్ 6.31 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఇది ఇన్ స్క్రీన్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫన్ టచ్ OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం తో నడుస్తుంది.

Vivo X200 FE 5G

కెమెరా, ఈ ఫోన్ లో 50MP (Sony IMX921) VCS మెయిన్ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు 50MP (Sony IMX882) పెరిస్కోప్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా అందించింది. ఈ ఫోన్ 3x ఆప్టికల్ జూమ్, 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు ZEISS కెమెరా ఫిల్టర్స్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టోటల్ ZEISS ఆప్టిక్స్ కలిగి ఉంటుంది.

ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది. ఈ వివో ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Also Read: boAt Dolby Atmos సౌండ్ బార్ ని అమెజాన్ సేల్ నుంచి 12 వేలకే అందుకోండి.!

Vivo X200 FE 5G: ప్రైస్

వివో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ను రూ. 54,999 ధరతో మరియు 16 జీబీ + 512 జీబీ వేరియంట్ ను రూ. 59,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లను వివో ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ ఫోన్ సేల్ జూలై 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

ఆఫర్లు:

వివో ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై రూ. 6,000 రూపాయల ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లేదా రూ. 6,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను HDFC, SBI మరియు AXIS బ్యాంక్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo