Sennheiser Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్.!
Sennheiser Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్
ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ అలెక్సా మరియు డాల్బీ అట్మాస్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ కలిగి ఉంటుంది
ఈరోజు అమెజాన్ నుంచి మూడు డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది
Sennheiser Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ అలెక్సా మరియు డాల్బీ అట్మాస్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మూడు డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ప్రీమియం సౌండ్ బార్ డీల్స్ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveySennheiser Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్
ప్రముఖ జర్మన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ సెన్ హైజర్ AMBEO సిరీస్ నుంచి అందించింది సౌండ్ బార్ Mini పై ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 54,990 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుంచి రూ. 5,000 డిస్కౌంట్ తో రూ. 49,990 ధరలో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ను కూడా అమెజాన్ అందించింది.

పైన తెలిపిన రేయ్ డిస్కౌంట్ ఆఫర్స్ కాకుండా ఈ సౌండ్ బార్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ జత చేసింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి HDFC, Kotak, IDFC FIRST, BOB CARD EMI, Federal మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకుంటే రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సెన్ హైజర్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 43,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Sennheiser Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
సెన్ హైజర్ AMBEO సౌండ్ బార్ మినీ చాలా ప్రీమియం ఫీచర్స్ మరియు సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో నాలుగు 1.6 inch ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు రెండు 4 inch ఉఫర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 43 Hz – 20 kHz రిచ్ ఆడియో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ కలిగి ఉంటుంది. ఇది ఆటోమేటిక్ రూమ్ కాలిబ్రేషన్ ఫీచర్ తో రూమ్ విస్తరణ మరియు ఎత్తు ఆధారంగా ఆటో ట్యూన్ చేస్తుంది. ఇది కాకుండా అడాప్టివ్ మోడ్ తో కంటెంట్ టైప్ ను బట్టి ఆడియో ను ట్యూన్ చేసుకుంటుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇందులో డాల్బీ అట్మాస్, DTS X, MPEG-H మరియు 360 రియాలిటీ ఆడియో సపోర్ట్ ఉన్నాయి. ఇది ఈ ఫీచర్స్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప ప్రీమియం సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 250W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ ప్రీమియం సౌండ్ బార్ 6× Class-D యాంప్లిఫైయర్ కలిగి గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది HDMI 2.1 (eARC), బిల్ట్ ఇన్ Wi-Fi సపోర్ట్, బిల్ట్ ఇన్ Alexa ఫీచర్ మరియు ఎయిర్ ప్లే మరియు గూగుల్ క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇది కంప్లీట్ ఫీచర్స్ కలిగిన పవర్ ఫుల్ అండ్ ప్రీమియం సౌండ్ గా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile