Tecno Spark Go 2: బడ్జెట్ టెక్నో స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
టెక్నో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు మార్కెట్లో లాంచ్ అయ్యింది
Tecno Spark Go 2 అండర్ రూ. 7000 బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చింది
ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు అందమైన రంగుల్లో లభిస్తుంది
Tecno Spark Go 2 : టెక్నో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ బడ్జెట్ షార్ట్ ఫోన్ ను చవక ధరలో పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో అందించింది.అండర్ రూ. 7000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఇప్పటికే మార్కెట్లో చాలా ఫోన్లు మార్కెట్ లో కొనసాగుతుండగా టెక్నో ఈ ఫోన్ ను కూడా అండర్ 7 వేల రూపాయల సెగ్మెంట్ లో మరొక పోటీదారుడుగా తీసుకు వచ్చింది.
SurveyTecno Spark Go 2 : ప్రైస్
టెక్నో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 6,999 రూపాయల్ ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది. అంటే, ఈ ఫోన్ మొదటి సేల్ జూలై 1వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు అందమైన రంగుల్లో లభిస్తుంది.
Also Read: Poco F7 5G: స్టన్నింగ్ ఫీచర్స్ తో విడుదలైన పోకో ఎఫ్ 7 ధర మరియ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
Tecno Spark Go 2 : ఫీచర్స్
టెక్నో స్పార్క్ గో 2 స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇండియన్ లాగ్వేజెస్ తో Ella AI సపోర్ట్ కలిగిన మొదటి ఫోన్ గా వచ్చింది. ఈ ఫోన్ సన్నగా మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HD ప్లస్ రిజల్యూషన్ కలిగిన పెద్ద స్క్రీన్ అందించింది. ఈ ఫోన్ ఆక్టా కోర్ చిప్ సెట్, 4GB ఫిజికల్ ర్యామ్, 4GB మెమొరీ ఫ్యూజన్ మరియు 64Mp ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 13MP మెయిన్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా సెటప్ అందించింది. ఈ ఫోన్ లో గొప్ప కాలింగ్ కోసం ఈ ఫోన్ లో AI యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ 4 సంవత్సరాల ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా టెక్నో తెలిపింది. ఈ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ IP 64 రేటింగ్ ఫోన్ గా కూడా వచ్చింది. అంటే, ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రేసిస్టెంట్ గా కూడా ఉంటుంది. టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ను 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది.