Poco F7 5G: స్టన్నింగ్ ఫీచర్స్ తో విడుదలైన పోకో ఎఫ్ 7 ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

పోకో ఈరోజు ఇండియా మార్కెట్లో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది

ఈ ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్లతో ఇండియాలో విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది

Poco F7 5G: స్టన్నింగ్ ఫీచర్స్ తో విడుదలైన పోకో ఎఫ్ 7 ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Poco F7 5G: పోకో ఈరోజు ఇండియా మార్కెట్లో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. అదే, పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్లతో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. పోకో ఈరోజే సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco F7 5G: ప్రైస్

పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 31,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ను ఈ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ 12 జీబీ + 512 జీబీ వేరియంట్ ని రూ. 33,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా అందించింది. జూలై 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్లు

పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ అందించింది. ఈ ఫోన్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది లేదా ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 29,999 ప్రారంభ ఆఫర్ ధరలో లభిస్తుంది.

Poco F7 5G: ఫీచర్స్

పోకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ ను 6.8 ఇంచ్ OLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగిన డిస్ప్లే మరియు ఇది 1.5K రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

Poco F7 5G

పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫాస్ట్ ప్రోసెసర్ కి మరింత వేగం అందించే 12GB LPDDR5X ఫిజికల్ ర్యామ్, 24 జీబీ టర్బో ర్యామ్ మరియు 256 జీబీ (UFS4.1) ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ HyperOS సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది.

కెమెరా పరంగా, F7 5జి స్మార్ట్ ఫోన్ 50MP Sony IMX 882 మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ మరియు 4K వీడియో రియార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 7550 mAh హెవీ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ బ్యాటరీని మరింత వేగంగా ఛార్జ్ చేసే 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా పోకో ఈ ఫోన్ లో అందించింది. అదనంగా, ఈ ఫోన్ లో చాల వేగంగా రివర్స్ ఛార్జ్ చేసే 22.5 W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కోడోత్ ఈ ఫోన్ లో జత చేసింది.

Also Read: vivo T4 Lite 5G : వివో అతి చవక 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది.!

ఇక ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇందులో దుల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి మరియు 6000mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సెటప్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo