Samsung Galaxy Z Flip 7: ఎడ్జ్ టు ఎడ్జ్ ఫ్లెక్స్ విండో మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!
శామ్సంగ్ లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యింది
Samsung Galaxy Z Flip 7 ను ఎడ్జ్ టు ఎడ్జ్ ఫ్లెక్స్ విండో మరియు AI సపోర్ట్ తో శామ్సంగ్ లాంచ్ చేసింది
ఈ ఫోన్ ను అల్యూమినియం ఫ్రేమ్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో అందించింది
Samsung Galaxy Z Flip 7: శామ్సంగ్ లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యింది. ఈ ఫ్లిప్ ఫోన్ ను ఎడ్జ్ టు ఎడ్జ్ ఫ్లెక్స్ విండో మరియు AI సపోర్ట్ తో శామ్సంగ్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను AI పవర్ హౌస్ అని శామ్సంగ్ ముద్దుగా పిలుస్తోంది. అంటే, అర్ధం చేసుకోవచ్చు ఈ ఫోన్ ఎటువంటి Ai ఫీచర్స్ కలిగి ఉంటుందని. ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
SurveySamsung Galaxy Z Flip 7: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఫోన్ ను అబ్బురపరిచే ఫ్లెక్స్ విండో డిస్ప్లే తో అందించింది. ఇందులో మధ్యకు మడత పెట్టగలిగే 6.9 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ మరియు వెలుపల 4.1 ఇంచ్ సూపర్ AMOLED ఫ్లెక్స్ విండో డిస్ప్లే ఉంటాయి. ఈ రెండు స్క్రీన్స్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 13.7mm మరియు మడత విప్పినప్పుడు కేవలం 6.5mm మందంతో మాత్రమే ఉండేలా స్లీక్ డిజైన్ అందించింది. ఈ ఫోన్ ను అల్యూమినియం ఫ్రేమ్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో అందించింది.

శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఫోన్ శామ్సంగ్ లేటెస్ట్ 3nm చిప్ సెట్ Exynos 2500 తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ కి జతగా ఈ ఫోన్ లో 12 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ OneUI 8 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ IP54 వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఈ లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ 50MP వైడ్ యాంగిల్ మరియు 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 10Mp సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ తో పాటు చాలా కెమెరా ఫిల్టర్స్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4300 mAh బిగ్ బ్యాటరీ తో వచ్చింది. ఈ ఫ్లిప్ ఫోన్ 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 మరియు వైర్లెస్ పవర్ షేరింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Samsung Galaxy Z Fold 7: జబర్దస్త్ ఫీచర్స్ మరియు స్లిమ్ డిజైన్ తో లాంచ్ అయ్యింది.!
Samsung Galaxy Z Flip 7 : ప్రైస్
శామ్సంగ్ ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. శామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ ఫోల్డ్ 7 (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 1,09,999 ప్రైస్ ట్యాగ్ తో మరియ (12 జీబీ + 512 జీబీ) వేరియంట్ ను రూ. 1,21,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీ- ఆర్డర్ కూడా ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ ఫోన్ జూలై 12వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి కూడా అందుబాటులోకి వస్తుంది.
ఈరోజు నుంచి 12వ వరకు ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ చేసే యూజర్లకు బేసిక్ వేరియంట్ దగ్గరకు 12 జీబీ + 512 జీబీ వేరియంట్ అందిస్తుందని, శామ్సంగ్ ప్రకటించింది.