Samsung Galaxy Tab S11 మరియు Tab S11 Ultra రెండు టాబ్లెట్స్ లాంచ్ చేసింది: ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
శాంసంగ్ ఈరోజు ప్రపంచ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ లేటెస్ట్ సిరీస్ నుంచి రెండు కొత్త ట్యాబ్ లను విడుదల చేసింది. ఈ సంవత్సరం 11 సిరీస్ నుంచి ఈ రెండు టాబ్లెట్స్ విడుదల చేసింది. ఇందులో Samsung Galaxy Tab S11 మరియు Tab S11 Ultra రెండు టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ రెండు టాబ్లెట్స్ కూడా సూపర్ స్లిమ్ బాడీ మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యాయి.
SurveySamsung Galaxy Tab S11 మరియు Tab S11 Ultra : ఫీచర్లు
ఈ రెండు కొత్త టాబ్లెట్స్ కూడా సూపర్ స్లీప్ తో లాంచ్ చేయబడ్డాయి. ఇందులో ట్యాబ్ ఎస్ 11 అల్ట్రా 14.6 ఇంచ్ అతి పెద్ద స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఇది కేవలం 5.1mm మందంతో సూపర్ స్లీక్ గా ఉంటుంది. కానీ ఈ బిగ్ టాబ్లెట్ 692 గ్రాముల బరువు ఉంటుంది. ఇక ట్యాబ్ ఎస్ 11 విషయానికి వస్తే, ఇది కూడా కేవలం 5.5mm మందంతో ఉంటుంది. అయితే, ఇది 469 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఈ రెండు కొత్త టాబ్లెట్స్ కూడా గొప్ప విజువల్స్ అందించే డైనమిక్ AMOLED 2x స్క్రీన్ కలిగి ఉంటాయి. అంతేకాదు, గొప్ప రిజల్యూషన్ మరియు 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటాయి.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ రెండు టాబ్లెట్స్ కూడా మీడియాటెక్ యొక్క 3nm చిప్ సెట్ Dimensity 9400 తో పని చేస్తాయి మరియు జతగా 12 జీబీ ర్యామ్ తో పాటు 512 జీబీ హెవీ స్టోరేజ్ కలిగి ఉంటాయి. అలాగే, ఈ టాబ్లెట్స్ One UI 8 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తాయి. ఈ రెండు టాబ్లెట్స్ కూడా S పెన్ సపోర్ట్ కలిగి ఉంటాయి మరియు Gemini Live తో పాటు Galaxy AI సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. ఈ టాబ్స్ డైలీ లైఫ్ కోసం తగిన అన్ని ఫీచర్స్ తో పాటు గొప్ప AI సత్తా కలిగి ఉంటాయి.
ఈ టాబ్స్ లో 13MP జతగా 8MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. వీటిలో ఎస్ 11 అల్ట్రా 11,600 mAh జంబో బ్యాటరీ మరియు ట్యాబ్ ఎస్ 11 మాత్రం 8,400 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటాయి.
Also Read: Jio Free Unlimited Data: 9వ వార్షికోత్సవం సందర్భంగా సూపర్ ఆఫర్ ప్రకటించిన జియో.!
Samsung Galaxy Tab S11 మరియు Tab S11 Ultra : ప్రైస్
ప్రస్తుతానికి ఈ ఈ రెండు టాబ్లెట్స్ యొక్క ఇండియా ప్రైస్ ఇంకా ప్రకటించలేదు. ప్రైస్ అప్డేట్ అందించిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాము. అయితే, US మార్కెట్ లో మాత్రం ట్యాబ్ ఎస్ 11 అల్ట్రా $1,199.99 (సుమారు రూ. 1,05,700) ధరతో మరియు ట్యాబ్ ఎస్ 11 $799.99 (సుమారు రూ. 70,481) ధరతో లాంచ్ అయ్యాయి.