Jio Free Unlimited Data: 9వ వార్షికోత్సవం సందర్భంగా సూపర్ ఆఫర్ ప్రకటించిన జియో.!

Jio Free Unlimited Data: 9వ వార్షికోత్సవం సందర్భంగా సూపర్ ఆఫర్ ప్రకటించిన జియో.!

Jio Free Unlimited Data: రిలయన్స్ జియో 9వ వార్షికోత్సవం మరియు 50 కోట్ల యూజర్లు రీచ్ అయిన సందర్భంగా జియో యూజర్ల కోసం సూపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే, రిలయన్స్ జియో యూజర్లు మూడు రోజుల పాటు ఉచిత డేటా అందుకునే అవకాశాన్ని అందించింది. ఇది మాత్రమే కాదు 9వ వార్షికోత్సవం సందర్భంగా మరిన్ని గొప్ప ఆఫర్లు కూడా జియో యూజర్ల కోసం అందించింది. జియో అందించిన ఉచిత అన్లిమిటెడ్ డేటా ఆఫర్ మరియు ఇతర ఆఫర్ వివరాలు కూడా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటి ఈ Jio Free Unlimited Data ఆఫర్?

జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సూపర్ ఆఫర్ ను అందించింది. దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో మొబైల్ నెంబర్ వినియోగిస్తున్న యూజర్లకు ఇది వర్తిస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ డేటా ఆఫర్ ని 5G స్మార్ట్ ఫోన్ వాడుతున్న యూజర్లు అందరూ కూడా వినియోగించుకోవచ్చు. యూజర్ చేసిన రీఛార్జ్ తో సంబంధం లేకుండా మూడు రోజుల పాటు ఉచితంగా 5G నెట్వర్క్ పై అన్లిమిటెడ్ డేటా వినియోగించుకోవచ్చు, అని రిలయన్స్ జియో అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభం అవుతుంది. అంటే, సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఈ ఉచిత అన్లిమిటెడ్ 5జి డేటా ఆఫర్ వర్తిస్తుంది.

అంటే, మీ దగ్గర 5G స్మార్ట్ ఫోన్ ఉండి మీరు జియో యొక్క 4G ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసినా కూడా ఈ మూడు రోజులు పాటు మీరు అన్లిమిటెడ్ 5జి డేటా ని ఆనందించవచ్చు. ఇదే కాదు 4G స్మార్ట్ ఫోన్ యూజర్లకు కూడా గొప్ప ఆఫర్ అందించింది. అదేమిటంటే, కేవలం రూ. 39 రూపాయలతో రీఛార్జ్ చేయడం ద్వారా సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 9GB డేటాని అందుకోవచ్చు.

పైన తెలిపిన రెండు ఆఫర్లు కాకుండా మరో గొప్ప ఆఫర్ కూడా అందించింది. అదే రూ. 349 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్. దీన్ని సెలబ్రేషన్ ప్లాన్ పేరుతో జియో అందించింది. జియో ఈ ప్లాన్ తో విలువైన వోచర్లు జతగా అందిస్తుంది.

Also Read: Samsung Galaxy S25 FE సుపీరియర్ కెమెరా మరియు ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Jio Rs. 349 ప్లాన్ ప్రయోజనాలు ఏమిటి?

జియో రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ తో 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా మరియు డైలీ 100 SMS వంటి లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో మరిన్ని ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో 2 నెలల జియో హోమ్ ఫ్రీ ట్రయల్, జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్, జియో గోల్డ్ పై 2% అదనపు లాభం, 6 నెలల Netmeds ఫస్ట్ మెంబర్షిప్, రిలయన్స్ డిజిటల్ వోచర్లు, 1 నెల జియో సావన్ ప్రో సుబ స్క్రిప్షన్ మరియు జొమాటో గోల్డ్ వాటి మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో 12 నెలలు మిస్ అవ్వకుండా టైమ్ ప్రకారం రీఛార్జ్ చేసే వారికి 13వ నెల ఉచితంగా రీఛార్జ్ ప్రయోజనాలు అందిస్తుందని జియో తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo