సెప్టెంబర్ 22 నుంచి Samsung Galaxy S24 Ultra కేవలం రూ. 71,999 ధరకు లభిస్తుంది.!

HIGHLIGHTS

Samsung Galaxy S24 Ultra కేవలం రూ. 71,999 ధరకు లభిస్తుంది

ఈ విషయాన్ని శాంసంగ్ ఇండియా స్వయంగా ప్రకటించింది

గొప్ప తగ్గింపు ఆఫర్ ని శాంసంగ్ ఇండియా అనౌన్స్ చేసింది

సెప్టెంబర్ 22 నుంచి Samsung Galaxy S24 Ultra కేవలం రూ. 71,999 ధరకు లభిస్తుంది.!

సెప్టెంబర్ 22 నుంచి Samsung Galaxy S24 Ultra కేవలం రూ. 71,999 ధరకు లభిస్తుంది. ఈ విషయాన్ని శాంసంగ్ ఇండియా స్వయంగా ప్రకటించింది. 2025 దసరా మరియు దీపావళి సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప తగ్గింపు ఆఫర్ ని శాంసంగ్ ఇండియా అనౌన్స్ చేసింది. శాంసంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ గా పేరొందిన గెలాక్సీ S సిరీస్ నుంచి అందించిన ఈ ప్రీమియం ఫోన్, సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy S24 Ultra : ఆఫర్ ప్రైస్

శాంసంగ్ గెలాక్సీ s24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ని ఇండియన్ మార్కెట్లో రూ. 1,29,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, 2025 పండుగ సీజన్ సందర్భంగా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 71,999 రూపాయల ఆఫర్ ప్రైస్ తో లభిస్తుంది. అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఇదే ప్రైస్ తో ఆఫర్ చేయబోతున్నట్లు ఇప్పటికే ఈ ఫోన్ బిగ్ డీల్ ని ప్రకటించింది. అంటే, ఈ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 58 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ను 2025 పండుగ సీజన్ సందర్భంగా శాంసంగ్ అందించింది.

Samsung Galaxy S24 Ultra : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సూపర్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 200MP వైడ్ యాంగిల్, 50MP టెలిఫోటో, 12MP అల్ట్రా వైడ్ మరియు 10MP టెలిఫోటో కెమెరా కలిగిన క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8K UHD వీడియో సపోర్ట్ తో గొప్పగా ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రొసెసర్ తో వస్తుంది మరియు శక్తివంతమైన 12GB జతగా 256GB హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

Samsung Galaxy S24 Ultra Price Cut

ఇది టైటానియం ఫ్రేమ్ మరియు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ QHD+ రిజల్యూషన్ కలిగిన పెద్ద 6.8 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. S24 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది 5000 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.

Also Read: Great Indian Festival 2025: డేట్ దగ్గరకు రావడంతో భారీ డీల్స్ అనౌన్స్ చేసిన Amazon.!

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ Gemini AI సపోర్ట్ తో గొప్ప పనులు చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని మరింత ఆహ్లాదం మరియు అనుకూలం చేసే S-Pen తో ఈ ఫోన్ వస్తుంది. ఆఫర్ ధరలో వచ్చినప్పుడు ఈ ఫోన్ ను కొనాలని ఎదురు చూసిన వారికి ఇది నిజంగా గొప్ప సమయం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo