Samsung Galaxy M36 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్, స్టన్నింగ్ కెమెరా మరియు 6 సంవత్సరాల OS అప్ గ్రేడ్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. సరికొత్తగా విడుదలైన ఈ శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy M36 5G: ప్రైస్
శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 17,499 ధరతో, (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 17,999 ధరతో మరియు హై ఎండ్ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ రూ. 20,499 ధరతో లాంచ్ అయ్యాయి. జూలై 12వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెజాన్ మరియు శాంసంగ్ ఆన్లైన్ స్టార్ మరియు ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్ నుంచి సేల్ అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ కేవలం 7.7mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క సొంత చిప్ సెట్ Exynos 1380 తో పని చేస్తుంది. ఇది 5జి చిప్ సెట్ మరియు దానికి జతగా 8 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి.
శాంసంగ్ ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా అందించింది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మైక్రో సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు 24W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.