iQOO 13 కొత్త వేరియంట్ న్యూ లుక్ మరియు సూపర్ ఫీచర్స్ తో రిలీజ్ అవుతోంది.!
iQOO 13 స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ కోసం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది.
ఐకూ 13 స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ జూలై 4వ తేదీన ఇండియాలో రిలీజ్ అవుతుంది
iQOO 13 స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ కోసం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. రీసెంట్ గా ఇండియాలో ఐకూ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన ఐకూ వెంటనే ప్రీమియం ఫోన్ రిలీజ్ గురించి టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ 13 లాంచ్ విశేషాలు మరియు ప్రత్యేకతలు ఏమిటో చూద్దామా.
SurveyiQOO 13 : లాంచ్
ఐకూ 13 స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ జూలై 4వ తేదీన ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రైమ్ డే లాంచ్ గా వస్తుంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి గొప్ప ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
iQOO 13 : ఫీచర్స్
ఇది ఐకూ 13 సిరీస్ యొక్క లేటెస్ట్ ప్రీమియం ఫోన్ గా వస్తుంది మరియు ఈ ఫోన్ ఫీచర్స్ కూడా ప్రీమియం గానే ఉంటాయి. ఐకూ 13 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో పని చేస్తుంది. ఇది 30 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే అల్ట్రా ఫాస్ట్ ఆక్టా కోర్ ప్రాసెసర్. ఈ చిప్ సెట్ కి జతగా Q2 గేమింగ్ చిప్ ని కూడా ఈ ఫోన్ లో అందించింది. ఇది 144Hz FPS గేమ్ ఫ్రేమ్ ఇంటర్ పోలేషన్ అందిస్తుంది.

ఐకూ 13 స్మార్ట్ ఫోన్ Q10 2K 144Hz అల్ట్రా ఐకేర్ కలిగిన మొదటి ఫోన్ గా వచ్చింది. ఇది 6.82 ఇంచ్ LTPO AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
Also Read: Oppo Reno 14 Series ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ప్రకటించిన ఒప్పో.!
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో Sony IMX 921 VCS ట్రూ కలర్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ మరియు 500MP Sony IMX 816 టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్, సర్కిల్ టు సెర్చ్ వంటి AI పనులు మరియు గొప్ప వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుంది. చివరిగా, ఈ ఫోన్ బ్యాటరీ వివరాలు చూస్తే, ఈ ఫోన్ ను 6000 mAh హెవీ బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.