Samsung Galaxy J7 Prime మరియు J5 Prime 32GB ఫోన్లఫై ప్రైస్ కట్
కంపెనీ Samsung Galaxy J7 Prime మరియు J5 Prime 32GB ధరలు కట్ అయ్యాయి . ఈ సమాచారం ముంబై ఆధారిత ఫోన్ రిటైలర్ మహేష్ టెలికామ్ ద్వారా తెలియవచ్చింది . మహేష్ టెలికామ్ ఈ సమాచారం తన పేస్ బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేసారు . అయితే కంపెనీ నుంచి మాత్రమే ప్రైస్ కట్ గురించి ఎటువంటి సమాచారం లేదు .
SurveySamsung Galaxy J7 Prime 32GB యొక్క ధరలో Rs 2000 వరకు కట్ అయ్యింది . ఇప్పుడు ఇది Rs 14,900 ధరలో అందుబాటు . ఇది ఈ ఏడాది మే లో Rs 16,900 ధరలో ప్రవేశపెట్టబడింది .
ఇక Samsung Galaxy J5 Prime 32GB ధరలో కూడా Rs 2,000 వరకు కట్ అయ్యింది. ఇప్పుడు ఇది కేవలం Rs 12,990 ధరలో లభ్యం . ఇది ఈ ఏడాది మే లో Rs 14,900 ధరలో ప్రవేశపెట్టబడింది .
శామ్సంగ్ గెలాక్సీ J7 ప్రైమ్ 32 జీబి 5.5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీనితో పాటు, ఈ స్మార్ట్ఫోన్ 3GB RAM కలిగి ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 32GB ఉంటుంది, ఇది 256GB కి ఎక్స్ పాండ్ చేయబడుతుంది.
ఈ స్మార్ట్ఫోన్ Android 6.0 మార్ష్మెల్లో ఆపరేటింగ్ సిస్టంలో పనిచేస్తుంది. దీనితో పాటు, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ డివైస్ లో ఉంది. ఈ డివైస్ లో బ్యాటరీ 3300mAh మరియు ఇది S బైక్ మోడ్తో వస్తుంది.
ఈ డివైస్ ప్రైమరీ కెమెరా 13 మెగా పిక్సల్స్ మరియు సెకండరీ కెమెరా 8 మెగా పిక్సల్స్ . కనెక్టివిటీ కోసం ఈ ఫోన్లో 4G LTE, GSM, Wi-Fi 802.11 b / g / n, NFC, USB కనెక్టివిటీ మరియు 3.5mm జాక్ ఉన్నాయి.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile