సరికొత్త లెథర్ డిజైన్ తో వచ్చిన SAMSUNG Galaxy F55 5G ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

సరికొత్త లెథర్ డిజైన్ తో వచ్చిన SAMSUNG Galaxy F55 5G ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
HIGHLIGHTS

శామ్సంగ్ ఇండియాలో ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్ 55 5జి ని విడుదల చేసింది

50MP సెల్ఫీ కెమెరా వంటి మరిన్ని ఫీచర్ లతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి ఈ ఫోన్ అర్లీ బర్డ్ సేల్ మొదలువుతుంది

SAMSUNG Galaxy F55 5G: శామ్సంగ్ ఇండియాలో ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్ 55 5జి ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త లెథర్ డిజైన్ మరియు 50MP సెల్ఫీ కెమెరా వంటి మరిన్ని ఫీచర్ లతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ గురించి శామ్సంగ్ గత కొంత కాలంగా టీజింగ్ చేస్తోంది మరియు ఈరోజు ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లతో పాటు ఎటువంటి ఆఫర్లు ఈ ఫోన్ లాంచ్ సమయంలో శామ్సంగ్ ప్రకటించింది, అనే అన్ని వివరాల పైన ఒక లుక్కేద్దామా.

SAMSUNG Galaxy F55 5G: ప్రైస్

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 26,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క రెండవ మరియు హై ఎండ్ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 32,999 ధరతో అనౌన్స్ చేసింది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి ఈ ఫోన్ అర్లీ బర్డ్ సేల్ మొదలువుతుంది.

ఆఫర్స్

ఇక శామ్సంగ్ ఫోన్ పైన అందించిన ఆఫర్ల విషయానికి వస్తే, శామ్సంగ్ ఈ ఫోన్ పైన మంచి ఆఫర్ల
ని అందించింది. ఈ కొత్త ఫోన్ కొనుగోలు చేసే కొనుగోలుదారులు గెలాక్సీ ఫిట్ 3 ని కేవలం రూ. 1999 రూపాయలకు లేదా 45W ట్రావెల్ అడాప్టర్ ను కేవలం రూ. 499 రూపాయలకే పొందవచ్చని తెలిపింది.

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి: ఫీచర్లు

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి స్మార్ట్ ఫోన్ ను సరికొత్త క్లాస్సి వేగాన్ లెథర్ డిజైన్ తో అందించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ చూడటానికి చాలా ఆకర్షణీయమైన మరియు ప్రీమియం లుక్స్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ ను లెథర్ డిజైన్ లో కూడా చాలా సన్నగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ Super AMOLED Plus డిస్ప్లేని అందించింది. ఈ డిస్ప్లే FHD రిజల్యూషన్ తో వస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది.

Also Read: boAt Wave Sigma 3 స్మార్ట్ వాచ్ చవక ధరలో బిగ్ డిస్ప్లే మరియు IP67 రేటింగ్ తో వచ్చింది.!

గెలాక్సీ ఎఫ్ 55 5జి ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో అందించింది. అంతేకాదు, ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. 4 OS అప్గ్రేడ్ లను మరియు 5 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్ లను ఈ ఫోన్ అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

SAMSUNG Galaxy F55 5G Camera
SAMSUNG Galaxy F55 5G Camera

ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ ను చూస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను అందించింది. ఇందులో, 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ కెమెరాతో 30 fps వద్ద 4K UHD వీడియో లను షూట్ చేయవచ్చని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీని అందించింది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo