జియో రూ.4,000 ధరకే లేటెస్ట్ 4G స్మార్ట్ ఫోన్ ప్రకటించనుందా….!!!

జియో రూ.4,000 ధరకే లేటెస్ట్ 4G స్మార్ట్ ఫోన్ ప్రకటించనుందా….!!!
HIGHLIGHTS

రిలయన్స్ జియో 2022 నాటికి 200 మిలియన్ల (20కోట్ల)కు పైగా స్మార్ట్ ‌ఫోన్ ‌లను ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలిసింది.

ఈ స్మార్ట్ ఫోన్లను భారతదేశంలో ప్రవేశ స్థాయి ధర $ 54 (~ 4,000 రూపాయలు) కు విక్రయించే అవకాశం ఉంది.

జియో యొక్క ఎంట్రీ లెవల్ స్మార్ట్ ‌ఫోన్ టారిఫ్ ప్లాన్ ‌లతో కూడి ఉంటుందని భావిస్తున్నారు.

రిలయన్స్ జియో 2022 నాటికి 200 మిలియన్ల (20కోట్ల)కు పైగా స్మార్ట్ ‌ఫోన్ ‌లను ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలిసింది. ఆశ్చర్యకరంగా, ఈ స్మార్ట్ ఫోన్లను  భారతదేశంలో ప్రవేశ స్థాయి ధర $ 54 (~ 4,000 రూపాయలు) కు విక్రయించే అవకాశం ఉంది. దానిలో భాగంగా రూ .33,737 కోట్లు (4.5 బిలియన్) పెట్టుబడి ఒప్పందంలో భాగంగా ఇది జరగవచ్చని తెలుస్తోంది.

ఈ విషయాల గురించి ప్రజలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ ఇచ్చిన నివేదిక ప్రకారం, జియో ప్లాట్‌ఫాంలు వచ్చే రెండేళ్ల నాటికి 200 మిలియన్లకు పైగా స్మార్ట్‌ ఫోన్‌ లను తయారు చేయాలని యోచిస్తున్నాయి. మునుపటి నివేదికల ప్రకారం, కంపెనీ మొదట్లో 100 మిలియన్ స్మార్ట్ ‌ఫోన్ ‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, వాటిని 2020 డిసెంబర్ చివరి నాటికి లాంచ్ చేయవచ్చని ఊహిస్తున్నారు. అయితే, కొత్త ఆలోచనల అనుగుణంగా సవరించిన వాటిని సర్దుబాటు చేయడానికి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలని కంపెనీ తన లోకల్ సరఫరాదారులను కోరినట్లు కొత్త అప్డేట్ సూచిస్తుంది.

లావా, కార్బన్ మరియు డిక్సన్ వంటి దేశీయ తయారీదారులతో పాటు ఫాక్స్కాన్ మరియు విస్ట్రాన్ వంటి గ్లోబల్ ప్లేయర్స్ తో కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినందున, $ 50 ఆండ్రాయిడ్ ఫోన్ కోసం తుది ఆర్డర్ భారతదేశంలో రెండు సంస్థలు లేదా అంతకంటే ఎక్కువ తయారీదారుల ద్వారా పంపిణీ చేయబడుతుందని భావిస్తున్నారు.

జియో భారతదేశంలో 200 మిలియన్లకు పైగా స్మార్ట్‌ ఫోన్ ‌లను ఉత్పత్తి చేయనుంది

అంతేకాకుండా, జియో యొక్క ఎంట్రీ లెవల్ స్మార్ట్ ‌ఫోన్ టారిఫ్ ప్లాన్ ‌లతో కూడి ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా భారతదేశంలో 350 మిలియన్లకు పైగా 2 జి వినియోగదారులకు కొనసాగుతున్నందున, ఆ వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని, వారిని 4G స్మార్ట్ ఫోన్ దిశగా మార్చడానికి సహాయపడుతుంది. ఆసక్తికరంగా, రిలయన్స్ జియో ఇటీవల తన కొత్త జియో పోస్ట్ ‌పెయిడ్ ప్లస్ సేవను ప్రకటించింది, ఇది ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు మరిన్ని OTT సేవలకు చందాతో వస్తుంది మరియు కేవలం ఈ ప్లాన్స్ రూ .399 నుండి ప్రారంభమవుతుంది.

ఇప్పటి వరకూ జియో తన రెండు ఫీచర్ ఫోన్లతో, 100 మిలియన్లకు పైగా వినియోగదారులను ఆకర్షించగలిగింది, అయితే, ఇప్పుడు ఫీచర్ ఫోన్లలోని వినియోగదారులను కూడా స్మార్ట్ ‌ఫోన్ బ్యాండ్‌ వాగన్‌ పైకి తీసుకెళ్లే అవకాశం వుంటుంది.

రిలయన్స్ జియో మొబైల్ రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo