POCO M8 5G ఫోన్ M సిరీస్ ప్రీమియం ఫోన్ గా లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

POCO M8 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టింది

ఈ ఫోన్ ను M సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

ఈ ఫోన్ పై రెండు భారీ లాంచ్ ఆఫర్స్ కంపెనీ ప్రకటించింది

POCO M8 5G ఫోన్ M సిరీస్ ప్రీమియం ఫోన్ గా లాంచ్ అయ్యింది.!

POCO M8 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టింది. ఇప్పటివరకు పోకో ఎం సిరీస్ నుంచి కేవలం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను మాత్రమే లాంచ్ చేయడం పరిపాటిగా మారింది. అయితే, పోకో ఎం8 5g స్మార్ట్ ఫోన్ లాంచ్ తో ఈ అపోహలను దూరం చేసింది. ఈ ఫోన్ ను M సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO M8 5G : ప్రైస్

ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (6 జీబీ + 128 జీబీ) ను రూ. 18,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 19,999 ధరతో మరియు హై ఎండ్ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 21,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, ఫ్రాస్ట్ సిల్వర్ మరియు గ్లేషియల్ బ్లూ మూడు రంగుల్లో లభిస్తుంది.

POCO M8 5G Price and Offers

ఆఫర్స్

ఈ ఫోన్ పై రెండు భారీ లాంచ్ ఆఫర్స్ కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ICICI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు బోనస్ డిస్కౌంట్ రెండు ఆఫర్లు అందించింది. అయితే, ఈ ఆఫర్స్ జనవరి 13వ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగే మొదటి సేల్ పై మాత్రమే అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 15,999 రూపాయల స్టార్ట్ ప్రైస్ లో పొందవచ్చు.

POCO M8 5G : ఫీచర్స్

ఈ ఫోన్ ను పోకో M సిరీస్ లో ఎన్నడూ లేని సరికొత్త కర్వుడ్ డిజైన్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం 7.35mm మందం మరియు 178 గ్రాముల బరువుతో చాలా స్లీక్ అండ్ లైట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ యాంటీ డ్రాప్ స్క్రాచ్ ప్రొటెక్షన్ మరియు మిలటరీ గ్రేడ్ SGS MIL STD 810 సర్టిఫికేషన్ తో ఉంటుంది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ 3D కర్వుడ్ డిస్ప్లే ని FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది.

POCO M8 5G Features

ఈ పోకో స్మార్ట్ ఫోన్ 8 లక్షల 25K వేల కంటే అధిక AnTuTu స్కోర్ కలిగిన క్వాల్కమ్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రోసెసర్ Snapdragon 6 Gen 3 తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ హైపర్ OS 2.0 జతగా ఆండ్రాయిడ్ 15 తో లాంచ్ అయ్యింది మరియు త్వరలో హైపర్ OS 3.0 అప్‌డేట్ అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ 4 సంవత్సరాల మేజర్ అప్‌డేట్స్ మరియు 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందుకుంటుంది.

Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

ఈ పోకో స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ కెమెరా జతగా మరో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 మరియు IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ స్లీక్ ఫోన్ లో 5520 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ ఫీచర్ ను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo