Zepto Pay: ఫాస్ట్ పేమెంట్ కోసం ఇన్ యాప్ UPI ను పరిచయం చేసిన జెప్టో.!
జెప్టో యూజర్ల అనుకూలత కోసం కొత్త ఫీచర్ ని పరిచయం చేసింది
జెప్టో లో పేమెంట్ కోసం కొత్తగా ఇన్ యాప్ UPI ను పరిచయం చేసింది
జెప్టో లో నేరుగా యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు
Zepto Pay: ప్రముఖ క్విక్-కామర్స్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ జెప్టో యూజర్ల అనుకూలత కోసం కొత్త ఫీచర్ ని పరిచయం చేసింది. జెప్టో లో పేమెంట్ కోసం కొత్తగా ఇన్ యాప్ UPI ను పరిచయం చేసింది. ఇది మరింత వేగవంతంగా మరియు సులభమైన విధంగా ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, విడిగా గూగుల్ పే, PhonePe,పెటియం వంటి UPI యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా జెప్టో లో నేరుగా యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు.
SurveyZepto Pay: ఏమిటి ఇది?
జెప్టో యాప్ లో పేమెంట్ ను మరింత వేగం మరియు సెక్యూర్ గా చేయడానికి జెప్టో తెచ్చిన కొత్త గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటుంది. ఈ కొత్త ఫీచర్ ను యాప్ లోపలే అందించింది. అంటే, ఇది ఇన్ యాప్ యూపీఐ పేమెంట్ ఫీచర్ గా జెప్టో యాప్ లో జత చేయబడింది.
Zepto Pay: ఎలా పని చేస్తుంది?
ఈ కొత్త ఇన్ యాప్ యూపీఐ పేమెంట్ ను యాప్ లోనే UPI ID లేదా బ్యాంకు ఖాతా లింక్ చేయాలి. ఆ తర్వాత మీరు UPI PIN ను నమోదు చేసి చెల్లింపును అథారైజ్ చేయవచ్చు. మీరు ఆర్డర్ చేసినప్పుడు చెల్లింపుకు ఈ కొత్త ఇన్ యాప్ యూపీఐ పేమెంట్ ను ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా యాప్ లో జరుగుతుంది కాబట్టి చాలా వేగంగా ఉంటుంది మరియు పేమెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు.

ఈ కొత్త ఫీచర్ తో చెల్లింపు పూర్తిగా జెప్టో యాప్‌లలోనే అవుతుంది. కాబట్టి, పేమెంట్ చేసే సమయంలో మీరు థర్డ్ పార్టీ UPI పేమెంట్ యాప్స్ కోసం చూడాల్సిన అవసరం ఉండదు. జెప్టో ఈ కొత్త ఫీచర్ ను అనవసర పేమెంట్ ఫైల్యూర్ ను తగ్గించడానికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Realme Oppo Merge: రియల్ మీ ఒప్పో ఒకటి కాబోతున్నాయా.. అసలు విషయం ఏమిటంటే!
ఇది ఎలా సెట్ చేసుకోవాలి?
- జెప్టో యాప్ ఓపెన్ చేసి పేమెంట్ Settings లోకి వెళ్లండి
- ఇందులో UPI కింద మీ బ్యాంక్ ఖాతాను లింక్ చేయండి
- చెక్ అవుట్ సమయంలో UPI పేమెంట్ మోడ్ ఎంచుకోండి
- తర్వాత UPI PIN ని నమోదు చేసి పేమెంట్ కంఫర్మ్ చేయండి
మీరు జెప్టో ఎక్కువగా ఉపయోగించే కస్టమర్ అయితే, మీకు ఈ కొత్త ఇన్ యాప్ యూపీఐ ఫీచర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కొత్త సెటప్ తో మీరు చాలా వేగంగా పేమెంట్ మరియు చెక్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది.