Realme Oppo Merge: రియల్ మీ ఒప్పో ఒకటి కాబోతున్నాయా.. అసలు విషయం ఏమిటంటే!
ఒప్పో మరియు రియల్ మీ ఇప్పుడు ఒకటి కాబోతున్నాయి
Realme Oppo Merge ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో, రియల్ మీ బ్రాండ్ ను ఒప్పో యొక్క ఒక ఉప బ్రాండ్ గా పరిచయం చేస్తుంది
Realme Oppo Merge: అతిపెద్ద చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో మరియు రియల్ మీ ఇప్పుడు ఒకటి కాబోతున్నాయి. వాస్తవానికి, ఒకటి కాబోతున్నాయి అనడం కంటే కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అని అనడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే, చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో, రియల్ మీ బ్రాండ్ ను ఒప్పో యొక్క ఒక ఉప బ్రాండ్ గా పరిచయం చేస్తుంది. నిజానికి, ఈ బ్రాండ్ ను కూడా ఒప్పో బ్రాండ్ పరిచయం చేసింది.
SurveyRealme Oppo Merge: అసలు విషయం ఏమిటి?
రియల్ మీ అనేది ఒప్పో నుంచి పుట్టిన ఒక బ్రాండ్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే, రియల్ మీ ఇన్నాళ్లు ఒక స్వతంత్ర కంపెనీ గా కొనసాగింది. అయితే, ఇప్పుడు ఒప్పో సారధ్యంలో కలిసి పని చేస్తుందని చెబుతున్నారు. ఇది పూర్తి స్థాయి విలీనం నిపుణులు కాదని చెబుతున్నారు. రియల్ మీ మరియు విలీనం తర్వాత రియల్ మీ ఒప్పో యొక్క ఒక సబ్ బ్రాండ్ గా పని చేస్తుంది. అంటే, రియల్ మీ ఇకపై పూర్తిగా స్వతంత్ర సంస్థ కాదు. అయితే, రియల్ మీ పేరు, ఫోన్లు, లాంచ్‌లు యధావిధిగా కొనసాగుతాయి.
Realme Oppo Merge: దారితీసిన కారణాలు?
ఒప్పో, రియల్ మీ మరియు వన్ ప్లస్ అన్నీ కూడా ఒకప్పుడు BBK Electronics గ్రూప్ కిందే పనిచేశాయి. అయితే, మార్కెట్లో పెరిగిన కాంపిటీషన్ మరియు కొత్త బ్రాండ్స్ పొందుతున్న ఆదరణ కు అనుగుణంగా సొంత బ్రాండ్స్ గా రూపాంతరం చెందాయి. అయితే, ఇప్పుడు మారిన మార్కెట్ పరిస్థితి మరియు ఖర్చు తో పాటు గట్టి పోటీ పెరగడంతో, అన్ని బ్రాండ్లను ఒకే దిశలో నడిపేందుకు మదర్ కంపెనీ ‘ఒప్పో’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త విలీనంతో వేర్వేరు మార్కెటింగ్ టీమ్‌లు, సేల్స్ తర్వాత అవసరమైన సర్వీస్ సెంటర్స్ కోసం వేర్వేరు నెట్‌వర్క్‌లు మరియు వేర్వేరు R&D ఖర్చులు వంటివి తగ్గుతాయని చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు ఒప్పో వద్ద ఉన్న కెమెరా మరియు డిస్‌ప్లే టెక్ తో పాటు బ్యాటరీ అండ్ ఛార్జింగ్ ఇన్నోవేషన్ రియల్ మీ ఫోన్ లకు కూడా వేగంగా అందించే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మార్కెట్లో ఉన్న ప్రధాన కంపెనీల పోటీని తట్టుకునే గొప్ప మార్గం అవుతుంది.
Also Read: Redmi Pad 2 Pro 5G: సూపర్ డిస్ప్లే మరియు ఫాస్ట్ 5జి చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది.!
మరి రియల్ మీ కస్టమర్ మాటేమిటి?
ఈ కొత్త రియల్ మీ ఒప్పో విలీనం తో ఇప్పటికే కొసాగుతున్న రియల్ మీ యూజర్లు మరియు ఇక నుంచి జతకానున్న కొత్త యూజర్లకు కూడా ఎటువంటి నష్టం లేదా ఇబ్బంది ఉండదు. అంతేకాదు, మరింత కొత్త సౌకర్యాలు కూడా చేరుకునే అవకాశం ఉండవచ్చు. అదేమిటంటే, ఈ విలీనం తర్వాత ఒప్పో సర్వీస్ నెట్‌వర్క్ వల్ల రియల్ మీ మొబైల్ సేవలు మరింత మెరుగవుతాయి. అలాగే, సాఫ్ట్‌వేర్ అండ్ అప్‌డేట్స్ మరింత వేగంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
అయితే, బ్రాండ్ స్వతంత్ర గుర్తింపు కొంత తగ్గవచ్చు మరియు ఇక నుంచి ఒప్పో స్ట్రాటజీ కి అనుగుణంగా లాంచ్ ప్లానింగ్ మారవచ్చు. కానీ ఇది యూజర్ పై ఎటువంటి ప్రభావం చూపదు.