Redmi Pad 2 Pro 5G: సూపర్ డిస్ప్లే మరియు ఫాస్ట్ 5జి చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఇండియాలో రెడ్ మీ కొత్త టాబ్లెట్ Redmi Pad 2 Pro 5G విడుదల చేసింది

ఈ కొత్త టాబ్లెట్ ను స్మార్ట్ ఫోన్ కలిగిన అన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ కొత్త టాబ్లెట్ ను సూపర్ డిస్ప్లే మరియు ఫాస్ట్ 5జి చిప్ సెట్ తో లాంచ్ చేసింది

Redmi Pad 2 Pro 5G: సూపర్ డిస్ప్లే మరియు ఫాస్ట్ 5జి చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది.!

Redmi Pad 2 Pro 5G: ఇండియాలో రెడ్ మీ కొత్త టాబ్లెట్ ను విడుదల చేసింది. ఈ కొత్త టాబ్లెట్ ను స్మార్ట్ ఫోన్ కలిగిన అన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త టాబ్లెట్ ను సూపర్ డిస్ప్లే మరియు ఫాస్ట్ 5జి చిప్ సెట్ తో లాంచ్ చేసింది. కొత్త రెడ్ మీ పాడ్ మంచి గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ గా ఉంటుంది. ఈ లేటెస్ట్ రెడ్ మీ పాడ్ ప్రైస్, ఆఫర్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ వివరంగా అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Pad 2 Pro 5G: ప్రైస్

రెడ్ మీ పాడ్ 2 ప్రో Wi-Fi వేరియంట్ ను రూ. 24,999 ధరతో లాంచ్ చేసింది. ఈ పాడ్ 2 ప్రో (Wi-Fi +5G) వేరియంట్ ను రూ. 27,999 స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో విడుదల చేసింది. గ్రాఫైట్ గ్రే మరియు క్విక్ సిల్వర్ రెండు రంగుల్లో ఈ కొత్త టాబ్లెట్ లభిస్తుంది. ఈ టాబ్లెట్ పై Axis, SBI మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు యొక్క రూ. 2,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. జనవరి 12వ తేదీ నుంచి ఈ రెడ్ మీ కొత్త పాడ్ సేల్ స్టార్ అవుతుంది.

Redmi Pad 2 Pro 5G: ఫీచర్స్

ఈ రెడ్ మీ లేటెస్ట్ పాడ్ లాగ్ ఫ్రీ గేమింగ్ అందించే శక్తి కలిగిన క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 4nm ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇది గొప్ప పెర్ఫార్మన్స్ అందిస్తుందని మరియు మంచి గేమింగ్ అనుభూతిని అందించే డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది.

ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఈ రెడ్ పాడ్ లో 12.1 ఇంచ్ పెద్ద పరిమాణం కలిగిన బిగ్ LCD స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 2.5K రిజల్యూషన్, డాల్బీ విజన్ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది గ్రెగొప్ప గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం బెస్ట్ ఆప్షన్ కలిగి వుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ రెడ్ మీ స్మార్ట్ పెన్ తో సపోర్ట్ కలిగి ఉంటుంది.

Redmi Pad 2 Pro 5G Price
Redmi Pad 2 Pro 5G Price

రెడ్ మీ పాడ్ 2 ప్రో లో వెనుక 13MP రియర్ మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 1080p వీడియో రికార్డింగ్ మరియు మంచి కలర్ ఫులో ఫోటోలు అందిస్తుంది. పాడ్ 2 ప్రో భారీ 12,000mAh బ్యాటరీ కలిగి వుంది. ఈ బ్యాటరీ పూర్తిగా ఒక రోజు మొత్తం నిలిచి ఉండే సత్తా కలిగి ఉంటుంది. ఈ పాడ్ 33W ఫాస్ట్ ఛార్జ్ మరియు 27W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Motorola Signature Series : 8K డాల్బీ విజన్ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో వస్తోంది.!

సౌండ్ పరంగా, ఇందులో Dolby Atmos సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్ సెటప్ ఉంటుంది. ఇది పెద్దగా సౌండ్ అందించే 300% వాల్యూమ్ బూస్ట్ తో పెద్ద సౌండ్ అందిస్తుంది. ఇది గేమింగ్ మరియు సినిమాలు చూడటానికి బాగా సరిపోతుంది. ఈ పాడ్ షియోమీ Hyper OS 2 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. అంతేకాదు, 5 సంవత్సరాల OS అప్‌డేట్స్ మరియు 7 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కి కూడా సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo