Motorola Signature Series: ఇండియన్ మార్కెట్లో మోటరోలా విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఈరోజు అనౌన్స్ చేసింది. మోటరోలా సిగ్నేచర్ పేరుతో ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ చేయబోతున్నట్లు మోటోరోలా తెలిపింది. అంతేకాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ సిరీస్ 8K డాల్బీ విజన్ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో వస్తుందని కంపెనీ గొప్పగా చెబుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Motorola Signature Series : లాంచ్ డేట్?
మోటోరోలా సిగ్నేచర్ సిరీస్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తుందని చెబుతోంది. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం కంపెనీ అఫీషియల్ అకౌంట్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ గురించి గొప్పగా టీజింగ్ చేస్తోంది.
మోటోరోలా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క కీలక ఫీచర్లు కూడా ఈ రోజు విడుదల చేసింది. సిగ్నేచర్ సిరీస్ ను 8K డాల్బీ విజన్ కెమెరా సపోర్ట్ కలిగిన జబర్దస్త్ కెమెరా సెటప్ తో అందిస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ DXO mark 2026 గోల్డ్ స్టాండర్డ్ ఫోటోగ్రఫీ తో ఉంటుందని కూడా మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ వరల్డ్ ఫస్ట్ 3.5 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫోన్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఇదే కాదు ఈ ఫోన్ 50MP Sony LYTA 828 సెన్సార్ కూడా ఉంటుంది.
ఈ ఫోన్ 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ moto ai సపోర్ట్ తో Ai సిగ్నేచర్ స్టైల్ ఫోటోలు అందిస్తుందని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ కలిగిన స్టెబిలైజేషన్ తో అల్ట్రా స్మూత్ వీడియోలు అందిస్తుందట.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ గురించి కూడా వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ కేవలం 6.9mm అల్ట్రా థిన్ డిజైన్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం 186 గ్రాముల బరువుతో చాలా తేలికగా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో అందిస్తుంది. ఈ ఫోన్ ను సిగ్నేచర్ క్లాస్ లగ్జరీ క్రాఫ్ట్ ఫాబ్రిక్ తో అందిస్తుంది. ఓవరాల్ గా ఇది లగ్జరీ ఫీల్ అండ్ లుక్స్ తో ఉంటుందిట.