BSNL Unlimited Plan: డైలీ 3GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు ఏడాది మొత్తం అందుకోండి.!
BSNL Unlimited Plan అందించే లాభాలు మాత్రం అమోఘం అని చెప్పవచ్చు
బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా వేగంగా రిలీజ్ చేస్తోంది
ఈ లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు గొప్ప లాభాలు అందిస్తుంది
BSNL Unlimited Plan: బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు వేగంగా నే వర్క్ ను విస్తరించడం మాత్రమే కాదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా వేగంగా రిలీజ్ చేస్తోంది. గతంలో 3G నెట్ వర్క్ పై సరైన వేగం లేక పోవడంతో డేటాపై యూజర్లకు పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అందుకే కాలింగ్ బేస్డ్ ప్లాన్స్ ఎక్కువగా రీఛార్జ్ చేసే వారు. అయితే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ దేశం మొత్తం 4G నెట్ వర్క్ విస్తరించిన తర్వాత ఇంటర్నెట్ వేగం పెరగడం తో అధిక డేటా కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్స్ ఎక్కువగా రీఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, బిఎస్ఎన్ఎల్ కొత్తగా డైలీ 3 జీబీ డేటాతో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించింది. ఈరోజు ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
SurveyBSNL Unlimited Plan: ఏమిటి ఈ ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ కొత్తగా అందించిన రూ. 2,799 గురించే మనం ఇప్పుడు మాట్లాడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం యూజర్లు చేసే మొత్తం ఖర్చు రూ. 2,799 మొత్తాన్ని నెల వారీగా లెక్కగడితే, నెలకు కేవలం రూ. 233 రూపాయలు మాత్రమే అవుతుంది. అయితే, ఈ తక్కువ ఖర్చుతో వచ్చే ఈ ప్లాన్ అందించే లాభాలు మాత్రం అమోఘం అని చెప్పవచ్చు.
BSNL Unlimited Plan: రూ. 2,799 లాభాలు ఏమిటి?
ఈ లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు గొప్ప లాభాలు అందిస్తుంది. ఇది బిఎస్ఎన్ఎల్ అందించిన వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు యాడ్`డైలీ అధిక డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు డైలీ 3 జీబీ హై స్పీడ్ డేటా 365 రోజుల పాటు అందుకుంటారు. ఇది కాకుండా ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో రోజంతా అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.

అంటే, ఈ ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 2026 సంవత్సరం పూర్తయ్యే వరకు మీకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్లాన్ ను సెల్ఫ్ కేర్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అధిక డేటాతో వన్ మంత్ వ్యాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్ కోరుకుంటే, ఆ ప్లాన్ కూడా మీకు అందుబాటులో ఉంది. అయితే, ఇది జనవరి 31వ తేదీ వరకు మాత్రమే అధిక డేటా ఆఫర్ తో ఉంటుంది.
Also Read: Zepto Pay: ఫాస్ట్ పేమెంట్ కోసం ఇన్ యాప్ UPI ను పరిచయం చేసిన జెప్టో.!
ఏమిటి ఈ బెస్ట్ వన్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రకటించిన రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్ అధిక డేటా అందించే బెస్ట్ వన్ మంత్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు ఈ 30 రోజులకు గాను టోటల్ 100GB హైడేటా తీసుకువస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS వంటి లాభాలు కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఉచిత BiTV యాక్సెస్ కూడా లభిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్ కేవలం జనవరి 31వ్ తేది వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.