Redmi Note 14 5G: సూపర్ బ్రైట్నెస్ స్క్రీన్ మరియు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!
Redmi Note 14 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది
ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు కీలక ఫీచర్స్ సైతం కంపెనీ బయట పెట్టింది
Redmi Note 14 5G Sony సూపర్ కెమెరా తో లాంచ్ అవుతుంది
Redmi Note 14 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు కీలక ఫీచర్స్ సైతం కంపెనీ బయట పెట్టింది. ఈ ఫోన్ గొప్ప బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ మరియు Sony సూపర్ కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరాతో లాంచ్ అవుతుంది.
Redmi Note 14 5G: ఫీచర్స్
ఈ రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 9న లాంచ్ అవుతుంది. ఇదే సిరీస్ నుంచి మరిన్ని ఫోన్ లను మరియు ఇయర్ బడ్స్ ను కూడా అదే రోజు లాంచ్ చేస్తున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ను మరియు కీలకమైన ఫీచర్స్ ను కూడా షియోమీ వెల్లడించింది.
రెడ్ మీ నోట్ 14 5జి స్మార్ట్ ఫోన్ ను సన్నని మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ యొక్క టీజర్ పేజి ద్వారా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ బయటపెట్టింది. ఈ ఫోన్ లో లో వెనుక పెద్ద స్క్వేర్ ఐలాండ్ లో పెద్ద రౌండెడ్ ట్రిపుల్ కెమెరా సిస్టంను అందించింది.
ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టంలో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-600 సెన్సార్ ఉందని షియోమీ కన్ఫర్మ్ చేసింది. ఇందులో ఒక అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ తో షార్ప్ మరియు బ్లర్ ఫ్రీ ఫోటోలు పొందవచ్చని షియోమీ చెబుతోంది.
Also Read: Pushpa 2 Leak: రికార్డ్స్ తిరగ రాస్తున్న పుష్ప 2 HD ప్రింట్ నెట్టింట్లో లీక్ : రిపోర్ట్
రెడ్ మీ నోట్ 14 5జి MiAi పవర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో AI ఫీచర్స్ ఉంటాయి మరియు ఇది మరింత స్మార్ట్ గా ఉండేలా చూస్తాయి. ఈ ఫోన్ లో చాలా ప్రకాశవంతమైన స్క్రీన్ ఉన్నట్లు కూడా షియోమీ చెబుతోంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో టీజ్ అవుతోంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉన్నట్లు కూడా అర్థం అవుతోంది.