Pushpa 2 Leak: అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప : ది రైజ్ యొక్క సీక్వెల్ మూవీ పుష్ప 2 : ది రూల్ ఈరోజే సినిమా థియేటర్స్ లో అట్టహాసంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా టికెట్ రేట్లు పెంచిన విషయంగా కొంత నిరాశ పరిచింది. అయినా సరే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. అయితే, ఈ సినిమా యొక్క పైరేటెడ్ HD ప్రింట్ నెట్టింట్లో లీకైనట్లు నివేదికలు తెలిపాయి.
Survey
✅ Thank you for completing the survey!
Pushpa 2 Leak:
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పైరసీ రక్కసి అల్లు అర్జున్ మరియు రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 ను కూడా వదల లేదు. వాస్తవానికి, కొత్త సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ సైట్స్ లో డౌన్ లోడ్ కోసం అందుబాటులోకి రావడం పరిపాటిగా మారిపోయింది. అయితే, పుష్ప 2 సినిమా అధిక టికెట్ రేట్లు కారణంగా, పైరసీ సైట్స్ ఈ సినిమాని చాలా త్వరగా ఆన్లైన్ లో ఉచిత డౌన్ లోడ్ కోసం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
లీక్ విషయం పియా నివేదికలు చెబుతున్న కొన్ని విషయాలు మాత్రం నిజమే అనిపించేలా చేస్తున్నాయి. ఎందుకంటే, దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నడూ చూడనంత రేటుకు పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు నిర్ణయించారు. ఇక్కడే పైరసీ సైట్ ఈ సినిమా లీక్ ను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ సినిమా పైరేటెడ్ HD ప్రింట్ ను మల్టీ పుల్ రిజల్యూషన్ లలో పైరసీ సైట్ లిస్ట్ చేసి ఆఫర్ చేస్తున్నట్లు కూడా నివేదికలు తెలిపాయి. ఈ సినిమా HD (1080p) మొదలుకొని 240p ప్రింట్ వరకు పైరసీ సైట్స్ లో డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉన్నట్లు నివేదికలు ప్రచురించాయి. ఈ సినిమా అనేక పైరసీ సైట్స్ తో పాటు Telegram లో కూడా ఉచిత డౌన్ లోడ్ కోసం అందుబాటులో ఉందని అనేక నివేదికలు చెబుతున్నాయి.