Redmi note 13 5G స్మార్ట్ ఫోన్ ని Super VIVID డిస్ప్లేతో అనౌన్స్ చేసిన షియోమి.!

HIGHLIGHTS

కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను లాంచ్ చేస్తున్నట్లు షియోమి ప్రకటించింది

Redmi note 13 5G సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తోంది

Super VIVID డిస్ప్లేతో జనవరి 4న విడుదల చేస్తున్నట్లు షియోమి అనౌన్స్ చేసింది

Redmi note 13 5G స్మార్ట్ ఫోన్ ని Super VIVID డిస్ప్లేతో అనౌన్స్ చేసిన షియోమి.!

ఇండియన్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను లాంచ్ చేస్తున్నట్లు షియోమి ప్రకటించింది. Redmi note 13 5G సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తున్నట్లు షియోమీఅనౌన్స్ చేసింది. ఇందులో, రెడ్ మి నోట్ 13 5జి స్మార్ట్ ఫోన్ ను అమేజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. అందుకే, ఈ ఫోన్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ నుండి టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను జనవరి 4న విడుదల చేస్తున్నట్లు షియోమి డేట్స్ అనౌన్స్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi note 13 5G

రెడ్ మి నోట్ 13 5జి స్మార్ట్ ఫోన్ సిరీస్ ను సూపర్ పవర్ మరియు సూపర్ నోట్ క్యాప్షన్ తో టీజ్ చేస్తోంది షియోమి. అమేజాన్ టీజర్ పేజ్ ద్వారా ఈ ఫోన్ కీలకమైన వివరాలతో టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, షియోమి అధికారిక వెబ్సైట్ నుండి ఇదే సిరీస్ నుండి లాంచ్ చేయబోతున్న రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ ను కూడా కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

ఇక రెడ్ మి నోట్ 13 5జి స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన వివరాలలోకి వెళితే ఈ ఫోన్ ను పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా డిజైన్ తో తీసుకు వస్తున్నట్లు టీజర్ పేజ్ ద్వారా చూపిస్తోంది.

Also Read : ZEBRONICS పవర్ ఫుల్ సౌండ్ బార్ పైన Flipkart Sale జబర్దస్త్ ఆఫర్.!

Super VIVID Display

రెడ్ మి నోట్ 13 5జి స్మార్ట్ ఫోన్

రెడ్ మి నోట్ 13 5జి స్మార్ట్ ఫోన్ గొప్ప కలర్స్ అందించగల సూపర్ ఇమ్మర్సివ్ వివిద్ డిస్ప్లేతో వస్తున్నట్లు షియోమి తెలిపింది. అయితే, ఇది ఎటువంటి డిస్ప్లే అనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించ లేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ కోసం ఇంకా సమయం ఉన్నది కాబట్టి మరిన్ని స్పెక్స్ ను మరియు ఫీచర్లను కూడా వెల్లడించే అవకాశం వుంది.

ఇక ఇదే సిరీస్ నుండి లాంచ్ చేయనున్నట్లు చెబుతున్న రెడ్ మి నోట్ 13 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ యొక్క కెమేరా సెటప్ బయటకి వచ్చింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి అందించిన టీజర్ పేజ్ ద్వారా ఈ ఫోన్ ను 200MP Mega OIS ట్రిపుల్ కెమేరా సెటప్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo