Realme P4 Power: ఏకంగా 10,000 mAh బ్యాటరీతో లాంచ్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ.!
రియల్‌మీ ఇండియన్ మర్కెట్ ను షేక్ చేసే న్యూస్ అందించింది
10,000 mAh బ్యాటరీతో Realme P4 Power లాంచ్ కన్ఫర్మ్ చేసింది
ఈ ఫోన్ పేరుకు తగ్గట్టు పవర్ ఫుల్ బ్యాటరీ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది
Realme P4 Power: రియల్‌మీ ఇండియన్ మర్కెట్ ను షేక్ చేసే న్యూస్ అందించింది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని అతి భారీ 10,000 mAh బ్యాటరీతో రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే, ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో 7000 నుంచి 7500 mAh బ్యాటరీ కలిగిన ఫోన్లు ఎక్కువగా లాంచ్ అవుతుంటే, రియల్‌మీ మాత్రమే ఏకంగా 10,000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసింది.
SurveyRealme P4 Power: లాంచ్ డేట్?
రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లంచ్ డేట్ ను రియల్‌మీ కన్ఫర్మ్ చేసింది. ఈ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్లు మరియు డిజైన్ వివరాలు కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ పేరుకు తగ్గట్టు పవర్ ఫుల్ బ్యాటరీ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది.
Realme P4 Power: డిజైన్ అండ్ ఫీచర్స్
రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ తెలిపే ఇమేజస్ మరియు ఈ ఫోన్ కీలక వివరాలు కూడా ఈరోజు విడుదల చేసింది. రియల్‌మీ పి4 పవర్ ఫోన్ న్యూ అండ్ స్టన్నింగ్ లుక్స్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తే ఎవరైనా ఈ మాట చెబుతారు. అంతేకాదు, ట్రాన్స్ బ్లూ, ట్రాన్స్ సిల్వర్ మరియు ట్రాన్స్ ఆరెంజ్ మూడు సరికొత్త రంగుల్లో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుంది.

ఇక ఈ ఫోన్ గురించి కంపెనీ రివీల్ చేసిన మెయిన్ ఫీచర్ ఈ ఫోన్ బ్యాటరీ. ఈ ఫోన్ ను అతి భారీ 10,000 mAh బ్యాటరీతో చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంత పెద్ద బ్యాటరీతో ఇండియాలో విడుదలవుతున్న మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఇది ఒక పవర్ బ్యాంక్ అంత బ్యాటరీ కలిగి ఉంటుంది. అయితే, ఇది చాలా స్లీక్ డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఏ ఫోన్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ తో ఇతర ఫోన్ మరియు డివైజెస్ ను వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: vivo X200T ఇండియా లాంచ్ డేట్ ప్రకటించిన వివో.. అంచనా ఫీచర్స్ తెలుసుకోండి.!
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అయితే, ఈ ఫోన్ కెమెరా కలిగిన సెన్సార్లు గురించి ఇంకా క్లియర్ డిటైల్స్ అందించలేదు. అయితే, ఈ ఫోన్ లో 50MP Sony IMX 882 ప్రైమరీ రియర్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు మరో సెన్సార్ ఉండవచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ రియల్‌మీ UI 7.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS పై నడుస్తుంది. అలాగే, ఈ ఫోన్ ను మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్ మరియు 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ తో అందిస్తున్నట్లు రియల్‌మీ తెలిపింది.