Motorola Edge 70 Fusion: మిడ్ రేంజ్ సెగ్మెంట్ ప్రీమియం ఫోన్ గా వచ్చింది.!

HIGHLIGHTS

ఈరోజు ఎడ్జ్ 70 సిరీస్ నుంచి ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ ప్రీమియం ఫోన్ గా వచ్చింది

Motorola Edge 70 Fusion మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ కలిగి ఉండే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

Motorola Edge 70 Fusion: మిడ్ రేంజ్ సెగ్మెంట్ ప్రీమియం ఫోన్ గా వచ్చింది.!

Motorola Edge 70 Fusion: మోటోరోలా ఈరోజు ఎడ్జ్ 70 సిరీస్ నుంచి ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ ప్రీమియం ఫోన్ గా వచ్చింది. అంటే, ఈ ఫోన్ మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ కలిగి ఉండే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఇది 7000mAh భారీ బ్యాటరీ, ఏడీబీ అద్భుతమైన డిజైన్ మరియు Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ గొప్ప సెటప్ కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Motorola Edge 70 Fusion: ప్రైస్

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ రెగ్యులర్ అండ్ హెవీ ర్యం వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ వేరియంట్స్ అండ్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (8GB + 128GB) ప్రైస్ : రూ. 26,999

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (8GB + 256GB) ప్రైస్ : రూ. 29,999

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (12GB + 256GB) ప్రైస్ : రూ. 32,999

ఈ స్మార్ట్ ఫోన్ ప్యాంటోన్ బ్లూ సర్ఫ్, ప్యాంటోన్ కంట్రీ ఎయిర్ మరియు ప్యాంటోన్ సిల్ హౌతీ మూడు రంగుల్లో లభిస్తుంది.

Motorola Edge 70 Fusion
Motorola Edge 70 Fusion

ఆఫర్స్

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మంచి లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. మార్చి 12వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది మరియు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా ఆన్లైన్ స్టోర్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: Amazon EPL Sale నుంచి Samsung Smart Tv నమ్మశక్యం కానంత చవక ధరకు లభిస్తోంది.!

Motorola Edge 70 Fusion: ఫీచర్స్

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1.5K రిజల్యూషన్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ మొత్తం స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ 7i టఫ్ గ్లాస్ ప్రొటక్షన్ తో అందించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 ప్రోసెసర్ జతగా 12 జీబీ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 50MP (Sony LYTIA 710) మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు మాక్రో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా తో లాంచ్ అయ్యింది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo