Amazon EPL Sale నుంచి Samsung Smart Tv నమ్మశక్యం కానంత చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ 2026 నుంచి భారీ డీల్స్ అండ్ ఆఫర్స్ అందించింది

భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో Samsung Smart Tv నమ్మశక్యం కానంత చవక ధరకు లభిస్తోంది

ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ డీల్ ని ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నాం

Amazon EPL Sale నుంచి Samsung Smart Tv నమ్మశక్యం కానంత చవక ధరలో లభిస్తోంది.!

Amazon EPL Sale, అదేనండి అమెజాన్ ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ 2026 నుంచి ఈరోజు భారీ డీల్స్ అండ్ ఆఫర్స్ అందించింది. అమెజాన్ ఇండియా ఈ సెల్ నుంచి ఈరోజు అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో Samsung Smart Tv నమ్మశక్యం కానంత చవక ధరకు లభిస్తోంది. అందుకే, ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ డీల్ ని ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon EPL Sale : Samsung Smart Tv

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ 2026 ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది మరియు మార్చి 12వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్ నుంచి ఈరోజు శాంసంగ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ Crystal 4K Vista పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని రోజు సేల్ నుంచి 34% డిస్కౌంట్ అందించి రూ. 25,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది మరియు ఈ టీవీ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

Amazon EPL Sale  Samsung Smart Tv Deal

పైన తెలిపిన రెండు ఆఫర్లు కాకుండా ఈ టీవీ పై రూ. 1,250 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ శాంసంగ్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ కేవలం 23,740 రూపాయల అతి తక్కువ ధరలో సేల్ నుంచి లభిస్తుంది. Buy From Here

Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

Samsung Smart Tv : ఫీచర్స్

ఈ శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఎల్ఈడి స్క్రీన్ 4K UHD (3840 x 2160)రిజల్యూషన్ మరియు 50 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. HDR10+, 4K Upscaling, మెగా కాంట్రాస్ట్, HLG, UHD డిమ్మింగ్ మరియు మోషన్ యాక్సిలరేటర్ వంటి మరిన్ని ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రాసెసర్ 4k ప్రాసెసర్ తో ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.

సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీలో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, Q-Symphony మరియు అడాప్టివ్ సౌండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈటీవీ మొత్తం రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20 సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ టీవీ విజువల్స్ కి తగిన గొప్ప సౌండ్ అందిస్తుందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, HDMI, ఆప్టికల్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo