పండుగ సేల్ కంటే ముందే Samsung 55 Mini LED స్మార్ట్ టీవీ పై నెవర్ బిఫోర్ డిస్కౌంట్.!
Samsung 55 Mini LED స్మార్ట్ టీవీ పై నెవర్ బిఫోర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుంది
దసరా పండుగ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వకుండానే పండుగ ఇకార్ట్ సైట్స్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది
ఈ టీవీ చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది
పండుగ సేల్ కంటే ముందే Samsung 55 Mini LED స్మార్ట్ టీవీ పై నెవర్ బిఫోర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుంది. దసరా పండుగ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వకుండానే పండుగ ఇకార్ట్ సైట్స్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అదేమిటి అలా అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ నిజమండి బాబు, ఈరోజు లభిస్తున్న ఒక ఆఫర్ చూస్తుంటే పండుగ సెల్ ముందే వచ్చిందా, అని అనిపిస్తుంది. మరి ఆ సేల్ ఏమిటో ఆ డీల్ ఏమిటో మరియు ఆ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఏంటో కూడా ఒక లుక్కేద్దామా.
SurveySamsung 55 Mini LED : ఆఫర్స్
శాంసంగ్ ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఇండియా ఈరోజు ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ని అందించింది. శాంసంగ్ Vision AI సిరీస్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి ని రూ. 51,990 ధరతో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ టీవీపై రూ. 6,250 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని జత చేసింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ బడ్జెట్ ధర లిస్ట్ లోకి చేరింది.

కేవలం కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై HSBC Taj క్రెడిట్ కార్డ్ రూ. 3,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 42,740 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. వాస్తవానికి, ఈ ప్రైస్ లో కేవలం 55 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ లు మాత్రమే లభిస్తుండగా, అమెజాన్ ఆఫర్ తో మీకు శాంసంగ్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ లభిస్తుంది. Buy From Here
Also Read: పోకో లేటెస్ట్ 1000mAh బ్యాటరో ఫోన్ Poco X8 Power ఫస్ట్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అందుకోండి.!
Samsung 55 Mini LED : ఫీచర్స్
ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం, 50Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన మినీ ఎల్ఈడి స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ మినీ ఎల్ఈడి ప్రోసెసర్, HDR 10+, 4k అప్ స్కేలింగ్ మరియు కలర్ బూస్టర్ వంటి ఫీచర్స్ తో ప్రీమియం విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ ఈ టీవీ Web Browser, క్విక్ రిమోట్ మరియు VRR అండ్ HGiG సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ టీవీ కలిగిన సౌండ్ సెటప్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లతో 30W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. అలాగే, Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ వంటి ప్రీమియం ఆడియో ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈటీవీలో HDMI, USB, ఆప్టికల్ అవుట్, ఈథర్నెట్, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
