BSNL Super Offer: పండుగ కోసం 14 రోజుల ఉచిత వ్యాలిడిటీ అందించే ఆఫర్ ప్లాన్ తెచ్చింది.!
బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం పండుగ ఆఫర్ అందించింది
ఈ ఆఫర్ తో యూజర్లు ఏకంగా 14 రోజుల ఉచిత వ్యాలిడిటీ అందుకోవచ్చు
కేవలం వాలిడిటీ మాత్రమే కాదు అన్లిమిటెడ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి
BSNL Super Offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన యూజర్ల కోసం పండుగ ఆఫర్ అందించింది. రంగుల పండుగ హోలీ సందర్భంగా ఈ బెస్ట్ అండ్ సూపర్ ఆఫర్ ని తీసుకొచ్చింది. బిఎస్ఎన్ఎల్ తెచ్చిన ఈ ఆఫర్ తో యూజర్లు ఏకంగా 14 రోజుల ఉచిత వ్యాలిడిటీ అందుకోవచ్చు. మరి బిఎస్ఎన్ఎల్ సరికొత్తగా తీసుకువచ్చిన ఈ సూపర్ ఆఫర్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyBSNL Super Offer: ఏమిటి ఈ ఆఫర్?
2026 హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ ఈ అద్భుతమైన కొత్త ఆఫర్ ని ప్రకటించింది. అదేమిటంటే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 997 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఈ ఉచిత వ్యాలిడిటీ అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేసే వారికి మాత్రమే ఈ అదనపు లేదా ఉచిత వ్యాలిడిటీ అందిస్తుంది.
BSNL Super Offer: లాభాలు ఏమిటి?
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 997 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ముందుగా 150 రోజుల వ్యాలిడిటీ లభించేది. అయితే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో 14 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా జత చేసింది. అంటే,ఈ కొత్త ఆఫర్ తో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ని ఇప్పుడు రీఛార్జ్ చేసే యూజర్లకు మొత్తంగా 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి కేవలం వాలిడిటీ మాత్రమే కాదు అన్లిమిటెడ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు మొత్తం వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. అలాగే, డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు, డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 164 రోజులు ఈ అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది.
Also Read: Vivo T5x 5G: మరో పవర్ ఫుల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన వివో.!
అంటే, ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 997 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 5 నెలల కంటే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు ఎంజాయ్ చేయవచ్చు. అయితే, ఈ ఆఫర్ కేవలం మార్చి 31వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ లిమిటెడ్ ఆఫర్ టైమ్ ముగిసే లోపు రీచార్జ్ చేసే యూజర్లకు మాత్రమే ఈ అదనపు వ్యాలిడిటీ ప్రయోజనం లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile