Vivo T5x 5G: మరో పవర్ ఫుల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన వివో.!

HIGHLIGHTS

వివో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు ప్రకటించింది

T సిరీస్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్లు వివో ప్రకటించింది

Vivo T5x 5G అతిపెద్ద ఫీచర్ ని కూడా ఈ ఫోన్ లాంచ్ అనౌన్స్ తో పాటు టీజ్ చేసింది

Vivo T5x 5G: మరో పవర్ ఫుల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన వివో.!

Vivo T5x 5G: అతిపెద్ద మొబైల్ తయారీ కంపెనీ వివో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు ప్రకటించింది. వివో యొక్క బడ్జెట్ సిరీస్ గా పేరొందిన T సిరీస్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్లు వివో ప్రకటించింది. కేవలం ఈ ఫోన్ లాంచ్ గురించి మాత్రమే కాకుండా ఈ ఫోన్ యొక్క అతిపెద్ద ఫీచర్ ని కూడా ఈ ఫోన్ లాంచ్ అనౌన్స్ తో పాటు టీజ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T5x 5G: లాంచ్ డేట్ ఏమిటి?

వివో టి5x 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ‘అప్ కమింగ్ సూన్’ స్టేటస్ తో మాత్రమే టీజింగ్ చేస్తోంది. త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేస్తామని వివో ఆటపట్టిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ పోస్టర్ లో ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ఒకటి రివీల్ కూడా చేసింది.

Vivo T5x 5G launch in india

Vivo T5x 5G: కీలక ఫీచర్స్

వివో టి5x 5జి స్మార్ట్ ఫోన్ 10 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే సెగ్మెంట్ ఫాస్ట్ చిప్సెట్ తో లాంచ్ అవుతుందని కంపెనీ టీజింగ్ చేసింది. ఈ ప్రాసెసర్ పేరు మాత్రం ఇంకా వెల్లడించలేదు. అంతేకాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆరిజన్ OS జతగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుందని కూడా చెబుతోంది. ప్రస్తుతానికి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క ఈ రెండు వివరాలు మాత్రమే వివో వెల్లడించింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని కీలక వివరాలు గురించి నెట్టింట్లో కొన్ని లీక్స్ తెలియజేస్తున్నాయి.

Also Read: Google Pixel 9a స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్ అందుకోండి.!

ఏమిటా లీక్డ్ ఫీచర్స్?

వివో యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పై ఇప్పటికే ఆన్లైన్ లో నడుస్తున్న లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ Dimensity 7300 లేదా 7400 సిరీస్ ప్రాసెసర్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని కూడా కొన్ని లీక్స్ చెబుతున్నాయి. ఇది కాకుండా ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన కెమెరా కెమెరా సెటప్ మరియు ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న భారీ బ్యాటరీ సెటప్ కూడా అందించే అవకాశం ఉంది.

ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ కూడా వివో త్వరలోనే అందించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పై వచ్చిన లీక్స్ లో ఎన్ని ఫీచర్స్ నిజమయ్యే అవకాశం ఉందో కూడా త్వరలోనే తెలుస్తుంది. ఈ ఫోన్ కొత్త అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo