vivo X200T ఇండియా లాంచ్ డేట్ ప్రకటించిన వివో.. అంచనా ఫీచర్స్ తెలుసుకోండి.!
vivo X200T ఇండియాలో రిలీజ్ చేయడానికి డేట్ మరియు టైం ను వివో ఫిక్స్ చేసింది
వివో ఇప్పుడు ఎక్స్ 200T స్మార్ట్ ఫోన్ ను కూడా ఇండియాలో రిలీజ్ చేస్తోంది
ఈ ఫోన్ ను కూడా జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో చెబుతోంది
vivo X200T స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రిలీజ్ చేయడానికి డేట్ మరియు టైం ను వివో ఫిక్స్ చేసింది. ఇప్పటికే వివో ఎక్స్ 200 సిరీస్ నుంచి ఎక్స్ 200, ఎక్స్ 200 ప్రో మరియు ఎక్స్ 200 FE ఫోన్స్ అందించిన వివో ఇప్పుడు ఎక్స్ 200T స్మార్ట్ ఫోన్ ను కూడా ఇండియాలో రిలీజ్ చేస్తోంది. ఈ ఫోన్ ను కూడా జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో చెబుతోంది.
Surveyvivo X200T ఎప్పుడు లాంచ్ అవుతుంది?
వివో ఎక్స్ 200T స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో జనవరి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు వివో డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు వివరాలు వెల్లడించే టీజర్ ఇమేజ్ కూడా అందించింది.
vivo X200T : ఫీచర్స్ ఏమిటి?
వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ ఇంజె తో ఈ ఫోన్ కెమెరా వివరాలు అందించింది. అయితే, ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ మాత్రం ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఆన్లైన్ లీక్ అయినా ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9400+ తో లాంచ్ అవుతుందని లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ వేగవంతమైన 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.1 స్టోరేజ్ కలిగి ఉంటుందని లీక్ చెబుతున్నాయి.

ఈ అప్ కమింగ్ వివో ఫోన్ వెనుక జబర్దస్త్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50MP Sony LYT-702 ప్రధాన సెన్సార్, 50MP శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ సెకండరీ మరియు 50MP Sony LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్లు ఉంటాయని కూడా లీక్స్ చెబుతున్నాయి. ఈ 4K వీడియో రికార్డింగ్, వివో కెమెరా ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్లతో వస్తుందని లీక్స్ ఉన్నాయి. ఇందులో 6,200 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
Also Read: iQOO 15R ఇండియా లాంచ్ టీజర్ విడుదల చేసింది: కొత్త డిజైన్ తో వస్తున్న ఫోన్.!
ఈ అప్ కమింగ్ వివో ఫోన్ 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుందని లీక్స్ వెల్లడించాయి. ఇది కాకుండా ఈ ఫోన్ స్క్రీన్ లో 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. ఇది HDR 10+ శాప్-ోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుందో క్లియర్ గా తెలియాలంటే మాత్రం ఈ ఫోన్ ఫీచర్స్ ను కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసే వరకు వేచి చూడాల్సిందే.