Realme Narzo 80 Lite బిగ్ బ్యాటరీ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Realme Narzo 80 Lite విడుదల చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను నార్జో 80 సిరీస్ లైట్ వెర్షన్ ఫోనుగా తీసుకు వస్తుంది

ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ ఒక్కొక్కటిగా రియల్ మీ టీజింగ్ చేస్తోంది

Realme Narzo 80 Lite బిగ్ బ్యాటరీ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతోంది.!

Realme Narzo 80 Lite స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను నార్జో 80 సిరీస్ లైట్ వెర్షన్ ఫోనుగా తీసుకు వస్తుంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ ఒక్కొక్కటిగా రియల్ మీ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ ను బిగ్ బ్యాటరీ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది.

Realme Narzo 80 Lite : లాంచ్ డేట్

రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను రియల్ మీ ఇంకా అనౌన్స్ చేయలేదు. కమింగ్ సూన్ పేరుతో ఈ ఫోన్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ కోసం అమెజాన్ అందించిన టీజింగ్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది.

Realme Narzo 80 Lite : కీలక ఫీచర్స్

రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు బ్యాటరీ వివరాలతో రియల్ మీ టీజింగ్ చేస్తోంది. రియల్ మీ యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కేవలం 7.94mm మందంతో స్లిమ్ డిజైన్ లో అందిస్తోంది. అయితే, ఈ ఫోన్ ఇంత సన్నగా ఉన్నా కూడా చాలా పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ రౌండ్ కార్నర్ డిజైన్ మరియు ముందు సెంటర్ పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంటుంది.

రియల్ మీ టీజింగ్ ప్రకారం, రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీతో ఈ ఫోన్ 46.6 గంటల ఫోన్ కాల్ లేదా 17 గంటల ఇన్స్టాగ్రామ్ ఉపయోగం లేదా 15.7 గంటల యూట్యూబ్ వీడియో లేదా 13.3 గంటల కాండీ క్రష్ గేమ్ వంటి వాటిని నిర్వహించే శక్తిని కలిగి ఉంటుందని రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా వస్తుంది.

ఈ ఫోన్ యొక్క మరో ఫీచర్ ను కూడా రియల్ మీ బయట పెట్టింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను ఇతర డివైజ్ లకు ఛార్జ్ అందించే పావుర బ్యాంక్ లాగా కూడా ఉపయోగించవచ్చట. ఎలాగంటే, ఈ ఫోన్ లో రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను రియల్ మీ అందించింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క ఈ ఫీచర్స్ మాత్రమే బాట పెట్టింది. అయితే, ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ రెండు కలర్లలో లాంచ్ అవుతుందని కూడా అర్ధం అవుతుంది.

Also Read: Lava Storm Play: స్టన్నింగ్ డిజైన్ తో కొత్త ఫోన్ ప్రకటించిన లావా.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలకమైన ఫీచర్స్ త్వరలోనే ప్రకటిస్తుంది. అప్పుడు ఈ ఫోన్ యొక్క మరిన్ని విశేషాలతో మళ్ళి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo