Lava Storm Play: స్టన్నింగ్ డిజైన్ తో కొత్త ఫోన్ ప్రకటించిన లావా.!
లావా అప్ కమింగ్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
Lava Storm Play మరియు Storm Play ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు చెబుతోంది
ఈ ఫోన్ ను కూడా బడ్జెట్ ఫోన్ గా తీసుకు వస్తుందని అంచనా వేస్తున్నారు
Lava Storm Play: ప్రముఖ ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా అప్ కమింగ్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. 2023 డిసెంబర్ నెలలో లావా విడుదల చేసిన లావా స్టోర్మ్ సిరీస్ నుంచి ఇప్పుడు రెండు కొత్త ఫోన్లు విడుదల చేస్తోంది. ఈ ఫోన్ సిరీస్ నుంచి ముందుగా స్టోర్మ్ 5జి ఫోన్ లాంచ్ చేసిన లావా ఇదే సిరీస్ నుంచి స్టోర్మ్ లైట్ మరియు ప్లే ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు చెబుతోంది. అయితే, కంపెనీ టీజర్ నుంచి ఒక ఫోన్ గురించి మాత్రమే వివరాలు అందించింది. ఈ ఫోన్ ను కూడా బడ్జెట్ ఫోన్ గా తీసుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
SurveyLava Storm Play: లాంచ్ డేట్
లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్టోర్మ్ లైట్ 2025 ఫోన్ ను జూన్ 13 వ తేదీ ఉదయం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు లావా డేట్ మరియు టైం అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది.
Lava Storm Play: ఫీచర్స్
లావా ఈ ఫోన్ లాంచ్ గురించి ఈరోజే ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ తో పాటు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు అర్ధమయ్యేలా చేసింది. ఎందుకంటే, లావా ఇప్పటి వరకు విడుదల చేసిన ఫోన్ లతో పోలిస్తే ఈ ఫోన్ చాలా విలక్షణమైన డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ ఫోన్ లో ఉన్న కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడయింది. అదేమిటంటే, ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా సెటప్ ను అందంగా కనిపించేలా డ్యూయల్ కలర్ బాం లో అందించింది. ఈ కొత్త డిజైన్ ఈ ఫోన్ ను చూడటానికి ప్రీమియం స్మార్ట్ ఫోన్ మాదిరిగా కనిపించేలా చేసింది.

ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ ను లావా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimesnity 7060 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు లావా కన్ఫర్మ్ చేసింది. అలాగే, రెండవ ఫోన్ (లావా స్టోర్మ్ లైట్) ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6400 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ గురించి కూడా హింట్ అందించింది. అదేమిటంటే, 8వేల కంటే తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉన్నట్లు టీజర్ పేజి ద్వారా హింట్ అందించింది.
Also Read: Vivo T4 Ultra: అల్ట్రా స్లిమ్ డిజైన్ మరియు 100x జూమ్ కెమెరాతో వస్తోంది.!
అయితే, ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన వివరాలు కూడా త్వరగా వెల్లడించే అవకాశం ఉంది. ఓవరాల్ గా బడ్జెట్ యూజర్ లక్ష్యంగా ఈ రెండు అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.