Poco M7 Plus 5G: చవక ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Poco M7 Plus 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది
ఈ ఫోన్ ను లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్, పెద్ద బ్యాటరీ మరియు కొత్త డిజైన్ తో అందించింది
ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో విడుదల చేసింది
Poco M7 Plus 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్, పెద్ద బ్యాటరీ మరియు కొత్త డిజైన్ తో అందించింది. బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ పోకో లేటెస్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు.
SurveyPoco M7 Plus 5G : ప్రైస్
పోకో ఈ కొత్త ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో, బేసిక్ (6GB + 128GB) వేరియంట్ రూ. 13,999 ధరలో మరియు (8GB + 128GB) వేరియంట్ రూ. 14,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ ఆక్వా బ్లూ, కార్బన్ బ్లాక్ మరియు క్రోమ్ సిల్వర్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.
ఆఫర్స్
ఈ ఫోన్ పై రెండు లాంచ్ ఆఫర్లు అందించింది. HDFC, ICICI మరియు SBI కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇదే కాదు, ఈ ఫోన్ ను పాత ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్లు ఈ ఫోన్ పై పోకో అందించింది. అయితే, వీటిలో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే అందుకునే అవకాశం ఉంటుంది.
Poco M7 Plus 5G : ఫీచర్స్
పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను 6.9 ఇంచ్ బిగ్ డిస్ప్లే తో అందించింది. FHD+ రిజల్యూషన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 144Hz వరకు రిఫ్రెష్ రేట్ ను ఈ స్క్రీన్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో కేవలం బిగ్ డిస్ప్లే మాత్రమే కాదు బిగ్ బ్యాటరీ కూడా అందించింది. ఈ ఫోన్ ను 7000 mAh బిగ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ తో అందించింది. ఈ బ్యాటరీ ని వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 18W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా పోకో ఈ ఫోన్ లో అందించింది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది.

ఈ పోకో కొత్త ఫోన్ Qualcomm యొక్క లేటెస్ట్ బడ్జెట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 6s Gen 3 తో అందించింది. ఈ చిప్ సెట్ కి జతగా 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 15 ఆపరేటింగ్ సిస్టం తో నడుస్తుంది. ఈ ఫోన్ 2 మేజర్ OS అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.
Also Read: Sony ULT Power Sound సిరీస్ నుంచి కొత్త స్పీకర్లు లాంచ్: ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP మైన + 2MP డెప్త్ కెమెరా కలిగిన డ్యూయల్ మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డైనమిక్ షాట్, ఆటో నైట్ మోడ్ మరియు UHD ఫోటో వంటి ఫీచర్స్ తో పాటు FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం మాట్టే ఫినిష్ తో చాలా ప్రీమియం లుక్స్ తో ఉంటుంది.