Poco M7 Plus 5G లాంచ్ డేట్ మరియు ఫస్ట్ లుక్ రివీల్ చేసిన పోకో.!
Poco M7 Plus 5G లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు ఈరోజు పోకో విడుదల చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ లో భాగంగా ఫోన్ ప్లస్ లుక్ ఇమేజ్ కూడా విడుదల చేసింది
ఈ ఫోన్ చూడటానికి చాలా స్లీక్ మరియు మంచి లుక్స్ తో కనిపిస్తోంది
Poco M7 Plus 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు ఈరోజు పోకో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ లో భాగంగా ఫోన్ ప్లస్ లుక్ ఇమేజ్ కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ సరికొత్త డిజైన్ కలిగి ఉన్నట్లు క్లియర్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్లు తెలుసుకోండి.
SurveyPoco M7 Plus 5G : లాంచ్ డేట్
పోకో ఎం7 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ను ఆగష్టు 13వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా ఈ ఫోన్ టీజర్ పేజీలో అందించింది.
Poco M7 Plus 5G: కీలక ఫీచర్లు
పోకో ఎం7 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లాంచ్ టీజర్ పేజీ ద్వారా ఈ విషయం వెల్లడించింది. ఈ ఫోన్ చూడటానికి చాలా స్లీక్ మరియు మంచి లుక్స్ తో కనిపిస్తోంది. ఇందులో బ్యాక్ ప్యానల్ కొత్తగా కనిపిస్తుంది మరియు ఆకట్టుకునే మల్టీ కలర్ రౌండ్ స్ట్రిప్ ను కూడా ఈ బ్యాక్ ప్యానల్ లో జత చేసింది. ఈ ఫోన్ సింపుల్ డిజైన్ తో ఆకట్టుకునేలా ఉంటుంది.

ఇక ఈ ఫోన్ కీలక ఫీచర్లు విషయానికి వస్తే, పోకో ఎం7 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ వివరాలు పోకో అందించింది. ఈ ఫోన్ ను బడ్జెట్ సెగ్మెంట్ లో పవర్ ఫుల్ 7000 mAh సిలికాన్ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో వేగవంతమైన ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు పోకో కన్ఫర్మ్ చేసింది.
ఈ పోకో ఎం 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో ఉన్న కెమెరా సెటప్ కూడా వెల్లడయ్యింది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ కెమెరా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ కెమెరా వివరాలు అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు మన ఎదురు చూడాలి. ఈ ఫోన్ మరిన్ని డీటెయిల్స్ కూడా త్వరలోనే పోకో వెల్లడించే అవకాశం ఉంది. మరిన్ని కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.
Also Read: Samsung Galaxy S24 Ultra 5G పై ఫ్లిప్ కార్ట్ సేల్ నెవర్ బిఫోర్ డిస్కౌంట్ అందుకోండి.!
Poco M7 Plus 5G: అంచనా ధర
పోకో ఎం7 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తున్నట్లు పోకో టీజింగ్ చేస్తోంది.