HIGHLIGHTS
POCO M7 5G Sale సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది
ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది
POCO M7 5G Sale: పోకో లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. 10 వేల కంటే తక్కువ ప్రారంభ ధరతో పోకో లేటెస్ట్ లాంచ్ చేసిన పోకో ఎం7 5జి బడ్జెట్ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లు ఇక్కడ చూడవచ్చు.
Surveyపోకో ఎం7 5జి స్మార్ట్ ఫోన్ 6GB + 128GB బేసి వేరియంట్ ను రూ. 9,999 ప్రారంభ ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ ను రూ. 10,999 ధరతో అందించింది. ఈ ఫోన్ పై Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ 5% డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది.
Also Read: LG Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో 10 వేల బడ్జెట్ లోనే లభిస్తోంది.!
ఈ పోకో స్మార్ట్ ఫోన్ 6.88 ఇంచ్ పెద్ద HD+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్ జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ అప్డేట్స్ అందుకుంటుంది.

ఈ పోకో ఫోన్ లో వెం ఊక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5160 mAh బిగ్ బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. అయితే, పోకో ఈ ఫోన్ బాక్స్ లో 33W ఫాస్ట్ చార్జర్ ని కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ మరియు శాటిన్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది.