7000 mAh బిగ్ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్న Poco

HIGHLIGHTS

Poco ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పేరు ఇంకా ప్రకటించలేదు

భారీ బ్యాటరీ గురించి టీజింగ్ చేస్తూ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది పోకో

7000 mAh బిగ్ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్న Poco

Poco ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పేరు ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ ఫోన్ యొక్క భారీ బ్యాటరీ గురించి టీజింగ్ చేస్తూ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది పోకో. ఇండియన్ మార్కెట్లో పోకో త్వరలో విడుదల చేయబొతునట్లు చెబుతున్న ఈ అప్ కమింగ్ ఫోన్ విషయాలు ఏంటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco అప్ కమింగ్ ఫోన్

పోకో ఇండియాలో విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ గురించి పెద్దగా వివరాలు అందించకుండానే ఈ ఫోన్ పై అంచనాలు పెంచే టీజర్ విడుదల చేసింది. పోకో లాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్న ఈ అప్ కమింగ్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో మెగా బ్యాటరీ కలిగి ఉంటుందని టీజింగ్ చేస్తోంది. కేవలం హింట్ ఇవ్వడం మాత్రమే కాదు ఈ ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ప్రైస్ వివరాలు కూడా ఈ టీజర్ పేజీ ద్వారా పోకో విడుదల చేసింది.

Poco Upcoming Phone

పోకో విడుదల చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుందని ప్రకటించింది. ఇది రెగ్యులర్ గా వచ్చే నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీ కాదు మరియు ఇది కొత్తగా వచ్చిన ప్రీమియం సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుందని ఈ ఫోన్ ఇమేజెస్ ద్వారా హింట్ అందించింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ అండర్ రూ. 15,000 ప్రైస్ సెగ్మెంట్ ఫోన్ గా వస్తుందని కూడా అనౌన్స్ చేసింది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ గా ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అవుతుందని పోకో గర్వంగా చెబుతోంది.

ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన టీజర్ పేజీలో ఈ ఫోన్ యొక్క ఇద్దరు వివరాలు కనబడకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంది. అయినా సరే ఈ ఫోన్ గురించి కొన్ని అంచనా వివరాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటంటే, ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా, FHD+ డిస్ప్లే మరియు 5జి చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి. అయితే, ఈ ఫోన్ గురించి కంపెనీ అఫీషియల్ అప్డేట్స్ అందించే వరకు ఇవన్నీ కూడా రూమర్స్ గా మాత్రమే మనం చూడాలి.

Also Read: Google Genie 3 : నూతన టెక్నాలజీతో మల్టీ మోడల్ జనరేటివ్ AI మోడల్ తెచ్చిన గూగుల్.!

ఈ ఫోన్ లాంచ్ డేట్ కూడా కంపెనీ ఇంకా అందించలేదు. కాబట్టి, త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలక ఫీచర్లు త్వరలో వెల్లడిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile