OPPO Reno 15 Pro మరియు 15 Pro Mini 5G ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
OPPO Reno 15 Pro మరియు 15 Pro Mini 5G స్మార్ట్ ఫోన్లు ఇండియాలో ఇండియాలో లాంచ్ అయ్యాయి
ఈ సిరీస్ నుంచి మొత్తం మూడు ఫోన్లు లాంచ్ చేసింది
ఒప్పో రెనో 15 ప్రో మరియు 15 ప్రో మినీ రెండు ఫోన్లు ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చాయి
OPPO Reno 15 Pro మరియు 15 Pro Mini 5G స్మార్ట్ ఫోన్లు ఇండియాలో ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్ నుంచి మొత్తం మూడు ఫోన్లు లాంచ్ చేసింది. అయితే, ఈ రెండు ఫోనులు కూడా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటాయి. కానీ ఈ ఫోన్స్ లో 15 ప్రో మినీ ఫోన్ కాంపాక్ట్ సైజులో ఉంటుంది. ఈరోజే సరికొత్తగా ఇండియాలో విడుదలైన ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్స్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyOPPO Reno 15 Pro : ప్రైస్ & ఆఫర్స్
ఒప్పో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఈ రెండు ప్రైస్ క్రింద చూడవచ్చు.
- ఒప్పో రెనో 15 ప్రో (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ధర : రూ. 67,999
- ఒప్పో రెనో 15 ప్రో (12 జీబీ + 512 జీబీ) వేరియంట్ ధర : రూ. 72,999
ఈ ఫోన్ కోకావా బ్రౌన్ మరియు సన్ సెట్ గోల్డ్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ. ఎక్స్ చేంజ్ బోనస్ మరియు బ్యాంక్ కార్డ్ పై 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.

OPPO Reno 15 Pro Mini 5G : ప్రైస్
ఒప్పో ఈ ఫోన్ ను కూడా రెండు వేరియంట్స్ లో అందించింది. ఈ రెండు ధరలు క్రింద చూడవచ్చు.
- ఒప్పో రెనో 15 ప్రో మినీ (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ధర : రూ. 59,999
- ఒప్పో రెనో 15 ప్రో మినీ (12 జీబీ + 512 జీబీ) వేరియంట్ ధర : రూ. 64,999
ఈ ఫోన్ పై కూడా రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ మరియు 10% బ్యాంక్ కార్డ్ పై అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇది కాకుండా ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో పై 50% అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఒప్పో రెనో 15 ప్రో మరియు ఒప్పో రెనో 15 ప్రో మినీ రెండు ఫోన్లు కూడా ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చాయి. జనవరి 13వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.
Also Read: POCO M8 5G ఫోన్ M సిరీస్ ప్రీమియం ఫోన్ గా లాంచ్ అయ్యింది.!
OPPO Reno 15 Pro మరియు 15 Pro Mini 5G: ఫీచర్స్
ఈ రెండు ఫోన్లు కూడా ఒకే ఫీచర్స్ కలిగి ఉంటాయి, బట్ ఈ ఫోన్స్ సైజు మరియు బ్యాటరీలో మాత్రం మార్పు ఉంటుంది. ఈ రెండు మోడల్స్ కూడా మీడియాటెక్ Dimensity 8450 5G చిప్ సెట్‌తో పని చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 తో లాంచ్ అయ్యాయి. ఈ రెండు మోడల్స్ కూడా 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB (UFS 3.1) స్టోరేజ్ కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు కూడా 5G, Wi-Fi 6, Bluetooth 5.4, NFC వంటి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటాయి.
కెమెరా పరంగా కూడా ఈ రెండు మోడల్స్ ఒకేలా ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. ఈ సెటప్ లో 200MP మెయిన్ సెన్సార్ (OIS), 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP (3.5x) పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. అలాగే, ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన అన్ని కెమెరాలతో 60FPS 4K వీడియో రికార్డ్ చేస్తుంది. అంతేకాదు. ఈ ఫోన్ గొప్ప AI కెమెరా ఫీచర్స్ తో పాటు ఒప్పో యొక్క ప్రత్యేకమైన ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ రెండు ఫోన్లు కలిగిన మార్పుల విషయానికి వస్తే, రెనో 15 ప్రో 6.78 ఇంచ్ LTPO AMOLED కలిగి ఉంటే రెనో 15 ప్రో మినీ మాత్రం 6.32 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్లు బ్యాటరీ వివరాల్లో కూడా పెద్ద మార్పు ఉంటుంది. అదేమిటంటే, రెనో 15 ప్రో 6,500 mAh బ్యాటరీ కలిగి ఉంటే రెనో 15 ప్రో మినీ లో 6,200 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా 80W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. అయితే, రెనో 15 ప్రో మాత్రం 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ ఫోన్లు కలిగిన అదనపు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్లు ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, X-Axis లీనియర్ హ్యాప్టిక్స్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా IP66, IP68 మరియి IP69 మూడు రకాల రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్లుగా ఉంటాయి.