Oppo Reno 14 Series : టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
Oppo Reno 14 Series 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరింత చేరువయ్యింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్స్ సైతం బయటపెట్టింది
కంపెనీ అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ యొక్క టాప్ 5 ఫీచర్స్ తేటతెల్లమయ్యాయి
Oppo Reno 14 Series స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరింత చేరువయ్యింది. ఒప్పో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్స్ సైతం బయటపెట్టింది. ఇందులో ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్స్ టాప్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కంపెనీ అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ యొక్క టాప్ 5 ఫీచర్స్ తేటతెల్లమయ్యాయి. ఈ స్పెక్స్ అనుగుణంగా ఈ ఫోన్ అంచనా ధర వివరాలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
SurveyOppo Reno 14 Series : లాంచ్ డేట్
ఒప్పో రెనో 14 సిరీస్ నుంచి లాంచ్ చేసే స్మార్ట్ ఫోన్ లను జూలై 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుంది. ఇందులో ఒప్పో రెనో 14 మరియు ఒప్పో రెనో 14 ప్రో రెండు ఫోన్లు ఉంటాయి. ఈ ఫోన్ యొక్క ప్రధాన ఫీచర్స్ వివరాలు కంపెనీ ఇప్పటికే బయటపెట్టింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Oppo Reno 14 Series : టాప్ 5 ఫీచర్లు

డిజైన్
ఒప్పో రెనో 14 సిరీస్ ఫోన్స్ సరికొత్త సిల్కీ స్మూత్ వెల్వెట్ గ్లాస్ కలిగిన ఇండస్ట్రీ ఫస్ట్ ఫోన్స్ గా లాంచ్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్స్ చాలా స్లీక్ గా ఉంటాయి. ఈ ఫోన్స్ ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు వన్ పీస్ స్కల్ప్టెడ్ గ్లాస్ డిజైన్ తో అద్భుతమైన డిజైన్ మరియు చాలా గట్టిగా కూడా ఉంటుంది.
డిస్ప్లే
ఒప్పో రెనో 14 సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ 6.83 ఇంచ్ OLED స్క్రీన్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్స్ HDR 10+ సపోర్ట్ తో వస్తాయి మరియు FHD+ రిజల్యూషన్ తో ఉంటాయి. ఇది కాకుండా ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు స్క్రీన్ పై నీరు పడినా కూడా పని చేసే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
పెర్ఫార్మెన్స్
ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ 16 మిలియన్ కంటే అధిక AnTuTu స్కోర్ తో వచ్చే మీడియాటెక్ Dimensity 8450 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో లాంచ్ అవుతాయి. ఈ ఫోన్ 12 జీబీ వేగవంతమైన ర్యామ్ మరియు 512 జీబీ అధిక అంతర్గత మెమరీ కలిగి గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే సత్తా కలిగి ఉంటుందని ఒప్పో గొప్ప ఈ ఫోన్స్ గురించి గొప్పగా చెబుతోంది.
Also Read: Samsung Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!
కెమెరా
ఒప్పో రెనో 14 సిరీస్ ఫోన్ లలో అందించిన కెమెరా సిస్టం వివరాలు కూడా వెల్లడించింది. ఈ ఫోన్ లలో 50MP ప్రధాన కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన 50MP టెలిఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించింది. ఈ ఫోన్లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. అంటే, ఈ ఫోన్లలో మొత్తం నాలుగు 50MP కెమెరాలు ఉంటాయి. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఈ ఫోన్ అన్ని కెమెరాలు కూడా 4K HDR రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటాయి.
AI సపోర్ట్
ఒప్పో ఈ అప్ కమింగ్ స్,ఆర్ట్ ఫోన్ సిరీస్ ను ఒప్పో AI మరియు జెమిని AI సపోర్ట్ తో రెండింటి మిళితం చేసి ఈ ఫోన్ లను అందిస్తుంది. అంటే, ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ తో పాటు ఈ స్మార్ట్ ఫోన్స్ మరిన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనులు చేసే సత్తా కలిగి ఉంటుంది.