OnePlus Nord CE5 : బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
వన్ ప్లస్ నార్డ్ CE5 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో విడుదలైన ఫోన్ గా నిలుస్తుంది
20 వేల రూపాయల బడ్జెట్ ధరలో 1.4 మిలియన్ AnTuTu స్కోర్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది
HDR 10+ సపోర్ట్ కలిగిన గొప్ప డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది
OnePlus Nord CE5 : వన్ ప్లస్ ఈరోజు లాంచ్ చేసిన రెండు ఫోన్లలో వన్ ప్లస్ నార్డ్ CE5 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో విడుదలైన ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో 1.4 మిలియన్ AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ చిప్ సెట్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన గొప్ప డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.
SurveyOnePlus Nord CE5 : ప్రైస్
వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 స్మార్ట్ ఫోన్ మూడు ఎంపికల్లో విడుదలయ్యింది. వీటిలో ఈ ఫోన్ 8 జీబీ + 128జీబీ బేసిక్ వేరియంట్ రూ. 24,999 ధరతో, 8 జీబీ 256 జీబీ మిడ్ వేరియంట్ రూ. 26,999 ధరతో మరియు హై ఎండ్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ . 28,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యాయి.

ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డై సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంటే, ఈ ఫోన్ జూలై 12వ తేదీ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ వన్ ప్లస్ అఫీషియల్ సైట్ మరియు అమెజాన్ నుంచి లభిస్తుంది.
ఆఫర్స్:
ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ మరియు డీల్స్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను ICICI, మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
OnePlus Nord CE5 : ఫీచర్లు
వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 స్మార్ట్ ఫోన్ ను కూడా స్లీక్ అండ్ సింపుల్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ OLED స్క్రీన్ ని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1430 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్, నెట్ ఫ్లిక్స్ HDR మరియు ప్రైమ్ వీడియో HDR సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ వన్ ప్లస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 Apex చిప్ సెట్ తో లాంచ్ అయింది. ఇది 1.4 మిలియన్ AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ చిప్ సెట్. ఈ చిప్ సెట్ కి జతగా గరిష్టంగా 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని అందించింది. ఈ ఫోన్ ఆక్సిజన్ OS 15.0 ఆధారితంగా ఆండ్రాయిడ్ 15 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ వన్ ప్లస్ AI ఫీచర్ తో గొప్ప ఎఐ పనులు కూడా నిర్వహించేలా అందించింది.
Also Read: OnePlus Nord 5 : జబర్దస్త్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో లాంచ్ అయ్యింది.!
ఈ ఫోన్ లో 50MP Sony LYT – 600 మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 16ఎంపీ సోనీ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 40fps వద్ద 4K రికార్డింగ్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లు మరియు టన్నుల కొద్ది ఇతర కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన భారీ 7100 mAh బిగ్ బ్యాటరీ అందించింది.