OnePlus Nord 5 : జబర్దస్త్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ నుంచి వన్ ప్లస్ ఈరోజు రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది

వన్ ప్లస్ నార్డ్ 5 5జి స్మార్ట్ ఫోన్ ను జబర్దస్త్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో వచ్చింది

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈ ఫోన్ ప్రత్యేకమైన ఆఫర్స్ తో సేల్ అవుతుంది

OnePlus Nord 5 : జబర్దస్త్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో లాంచ్ అయ్యింది.!

OnePlus Nord 5: వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ నుంచి వన్ ప్లస్ ఈరోజు రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. ఇందులో, వన్ ప్లస్ నార్డ్ 5 5జి స్మార్ట్ ఫోన్ ను జబర్దస్త్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord 5 : ప్రైస్

వన్ ప్లస్ ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో 8 జీబీ + 256 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 31,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్ వేరియంట్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ను రూ. 34,999 ధరతో మరియు హైఎండ్ 12 జీబీ + 512 జీబీ వేరియంట్ ను రూ. 37,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. జూలై 9వ తేదీ నుంచి 12PM ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈ ఫోన్ ప్రత్యేకమైన ఆఫర్స్ తో సేల్ అవుతుంది.

ఆఫర్లు

వన్ ప్లస్ ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ . 29,999 రూపాయల ప్రారంభ ధరకే లభిస్తుంది.

OnePlus Nord 5 : ఫీచర్లు

వన్ ప్లస్ ఈ కొత్త ఫోన్ ను గేమింగ్, కెమెరా మరియు డైలీ వాడకానికి అవసరమైన తగిన బలమైన ఎంపికగా అందించింది. ఈ ఫోన్ ప్రీమియం కలర్ చేతిలో ఫిట్ గా ఉండే కాంపాక్ట్ అండ్ స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ లో 12 జీబీ LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని జత చేసింది.

OnePlus Nord 5 Features

ఈ ఫోన్ 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 144Hz రిఫ్రెష్‌రేట్ మరియు 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ మరియు ఆక్వా టచ్ 2.0 ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గేమింగ్ మరియు కంటెంట్ కోసం గొప్పగా ఉంటుందని వన్ ప్లస్ తెలిపింది.

వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించింది. ఇందులో 50MP Sony LYT – 700 మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP JN1 సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా సహజంగా కనిపించే స్కిన్ కలర్, AI కెమెరా ఫీచర్స్ మరియు 60fps తో 4K వీడియో రికార్డింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: Dolby Atmos సపోర్ట్ తో కొత్త Nirvana IVY Pro ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!

ఈ ఫోన్ లో కూడా వన్ ప్లస్ 13 సిరీస్ మాదిరిగా వన్ ప్లస్ AI కోసం ప్రత్యేకమైన బటన్ ను వన్ ప్లస్ అందించింది. వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ 6800 mAh బిగ్ బ్యాటరీ, 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప 5G మరియు Wi-Fi కనెక్టివిటీ కోసం హై పెర్ఫార్మెన్స్ యాంటెన్నా కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo