OnePlus 13s: చేతిలో ఇమిడే కాంపాక్ట్ డిజైన్ మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!
OnePlus 13s స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలు
ఈరోజు కొత్త టీజర్ వీడియో కూడా విడుదల చేసింది
ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు కూడా వెల్లడించింది
OnePlus 13s స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టిన వన్ ప్లస్, ఈరోజు కొత్త టీజర్ వీడియో కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ ను చేతిలో ఇమిడే కాంపాక్ట్ డిజైన్ మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. కంపెనీ అందించిన కొత్త టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు కూడా వెల్లడించింది.
OnePlus 13s: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ఆసక్తి రేకెత్తించే వివరాలు మరియు టీజర్ వీడియోలను అందిస్తున్న వన్ ప్లస్ ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు మాత్రమే వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ ప్రకారం ఈ ఫోన్ అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
OnePlus 13s: ఫీచర్స్
వన్ ప్లస్ ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ బ్లేజింగ్ స్పీడ్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని వన్ ప్లస్ స్వయంగా వెల్లడించింది మరియు ఈ ఫోన్ చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది.
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కేవలం 6.32 ఇంచ్ స్క్రీన్ తో ఉంటుంది మరియు ఈ ఫోన్ చేతిలో ఇమిడే కాంపాక్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. రీసెంట్ గా వన్ ప్లస్ లాంచ్ చేసిన ఫోన్ లతో పోలిస్తే ఇది పెద్ద చేంజ్ అవుతుంది. అంతేకాదు, నోటిఫికేషన్, కెమెరా, AI, ఫ్లాష్ లైట్ మరియు ఎడిటింగ్ వంటి మరిన్నింటి కోసం ఈ ఫోన్ లో ప్రత్యేకమైన Plus Key ని కూడా అందించింది.
వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ చేస్తోంది. వన్ ప్లస్ అందించిన కొత్త టీజర్ వీడియో నుంచి ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో గ్రే, పింక్ మరియు బ్లాక్ మూడు వేరియంట్స్ ఉన్నట్లు చూపించింది. అయితే, ఈ ఫోన్ కలర్ వివరాలు క్లియర్ గా తెలియాల్సి వుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP + 50MP కెమెరా అందించే అవకాశం ఉండవచ్చు.
Also Read: VIVO V50 5G Elite Edition లాంచ్ చేసిన వివో: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ గురించి కంపెనీ మూడు నినాదాలతో టీజింగ్ చేస్తోంది. టీజింగ్ ప్రకారం, ఈ ఫోన్ చిన్న సైజులో ఉండే స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ మొబైల్ ఫోన్ గా వస్తుంది.