స్టన్నింగ్ కెమెరాతో వచ్చిన ViVO V70 ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ViVO V70 స్మార్ట్ ఫోన్ రోజు ఇండియాలో లాంచ్ అయ్యింది
వివో వి70 సిరీస్ లో ఈ ఫోన్ బేసిక్ ఫోన్ గా లాంచ్ అయ్యింది
పవర్ ఫుల్ కెమెరా సెటప్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో రిలీజ్
ViVO V70 స్మార్ట్ ఫోన్ రోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. వివో ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి గత నెలరోజులుగా టీజింగ్ చేసింది మరియు ఎట్టకేలకు ఈ రోజు విడుదల చేసింది. వివో వి70 సిరీస్ లో ఈ ఫోన్ బేసిక్ ఫోన్ గా లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ మరియు పవర్ ఫుల్ కెమెరా సెటప్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో రిలీజ్ చేసింది. స్టన్నింగ్ కెమెరాతో వచ్చిన ViVO V70 ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyViVO V70 : ప్రైస్
వివో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ మరియు రెండు కలర్ ఆప్షన్స్ లో అందించింది. ఈ రెండు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
వివో వి 70 (8GB + 128GB) వేరియంట్ ప్రైస్ : రూ. 45,999
వివో వి 70 (8GB + 256GB) వేరియంట్ ప్రైస్ : రూ. 49,999
వివో ఈ ఫోన్ ను పాషన్ రెడ్ మరియు లెమన్ ఎల్లో రెండు రంగుల్లో అందించింది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. అయితే, ఈ రోజు నుంచే ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ను కంపెనీ స్టార్ట్ చేసింది.

ఆఫర్స్:
ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ ను వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 4,600 రూపాయల వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 4,600 రూపాయల వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ లను అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది. ఇది కాకుండా రూ. 1,000 స్టూడెంట్ డిస్కౌంట్ మరియు 1 సంవత్సరం అదనపు వారంటీ వంటి ఆఫర్స్ తో వచ్చింది.
Also Read: ViVO V70 Elite: వివో లేటెస్ట్ ప్రీమియం ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఇవిగో.!
ViVO V70 : ఫీచర్స్
వివో వి70 స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ తో చాలా లైట్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో 3D అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ కలిగిన 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ P3 కలర్ గాముట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. వివో ఈ లేటెస్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ UFS 4.1 ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా సెటప్ లో 50MP (ZEISS) ప్రధాన సెన్సార్, 8MP (ZEISS) అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 50MP (ZEISS) నైట్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. అలాగే, ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఈ వివో కొత్త ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ మరియు 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో పాటు AI కెమెరా ఫీచర్స్ తో వచ్చింది.
ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ వివో ఫోన్ 6500 mah బ్లూవోల్ట్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W ఫాస్ట్ ఛార్జ్ మరియు గేమింగ్ కోసం అవసరమైన బైపాస్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంది. IP68 అండ్ IP69 రేటింగ్ తో ఈ ఫోన్ ను డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile