VIVO V50 5G Elite Edition లాంచ్ చేసిన వివో: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

VIVO V50 5G Elite Edition ను ఈరోజు భారత్ లో వివో విడుదల చేసింది

వివో వి50 సిరీస్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన ఎడిషన్ గా విడుదల చేసింది

ప్రత్యేకమైన బాక్స్ లో ఈ ఫోన్ తో పాటు వివో TWS 3e Buds ను కూడా జతగా అందిస్తుంది

VIVO V50 5G Elite Edition లాంచ్ చేసిన వివో: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

VIVO V50 5G Elite Edition ను ఈరోజు వివో విడుదల చేసింది. వివో ఇటీవల విడుదల చేసిన వివో వి50 సిరీస్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన ఎడిషన్ గా విడుదల చేసింది. ఈ ఫోన్ కోసం అందించే ప్రత్యేకమైన బాక్స్ లో ఈ ఫోన్ తో పాటు వివో TWS 3e Buds ను కూడా జతగా అందిస్తుంది. వివో సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.

VIVO V50 5G Elite Edition : ప్రైస్

వివో ఈ కొత్త ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను రోజ్ రెడ్ 12GB + 512GB సింగిల్ వేరియంట్ లో రూ. 41,999 ధరతో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల SBI, HDFC మరియు ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అదనంగా, ఈ ఫోన్ పై అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందిస్తోంది. Buy From Here

Also Read: Yamaha Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

VIVO V50 5G Elite Edition : ఫీచర్స్

ఈ వివో కొత్త ఫోన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ స్క్రీన్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు డిమాండ్ షీల్డ్ గ్లాస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ 12GB ఫిజికల్ ర్యామ్, 12GB అదనపు ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

VIVO V50 5G Elite Edition

ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ అన్ని కెమెరాలు కూడా ZEISS ఆప్టిక్స్ సెటప్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉన్నా కూడా 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ వివో ఫోన్ స్మార్ట్ AI ఫీచర్స్ మరియు AI సపోర్ట్ ను కలిగి ఉంటుంది. వివో వి50 ఎలీట్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ కూడా IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo